ETV Bharat / sports

డిన్నర్ బ్రేక్: టీమ్ఇండియా 41/2

author img

By

Published : Dec 17, 2020, 12:00 PM IST

ఆస్ట్రేలియాతో జరుగుతోన్న పింక్ బాల్ టెస్టు మొదటి రోజు డిన్నర్ బ్రేక్ సమయానికి రెండు వికెట్ల నష్టానికి 41 పరుగులు చేసింది భారత్. కోహ్లీ (5), పుజారా (17) క్రీజులో ఉన్నారు.

IND vs AUS TEST: Australia bowlers shines. IND 41/2 after dinner break
డిన్నర్ బ్రేక్: భారత్ 41/2

ఆస్ట్రేలియాతో జరుగుతోన్న పింక్ బాల్ టెస్టులో మొదట బ్యాటింగ్ చేస్తోన్న టీమ్ఇండియా ఆచితూచి ఆడుతోంది. డిన్నర్ బ్రేక్ సమయానికి రెండు వికెట్ల నష్టానికి 41 పరుగులు చేసింది.

ఇన్నింగ్స్ రెండో బంతికి స్టార్క్ బౌలింగ్​లో బౌల్డయ్యాడు పృథ్వీ షా. తర్వాత పుజారాతో కలిసి ఇన్నింగ్స్​ను చక్కదిద్దాడు మయాంక్ అగర్వాల్. వీరిద్దరూ రెండో వికెట్​కు 31 పరుగులు చేశారు. భాగస్వామ్యం కుదురుకుంటున్న క్రమంలో మయాంక్​ (17)ను ఔట్ చేశాడు కమిన్స్. ప్రస్తుతం కోహ్లీ (5)తో కలిసి క్రీజులో ఉన్నాడు పుజారా (17). వీరిద్దరూ ఆచితూచి ఆడుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.