ETV Bharat / sports

భారత్-ఆసీస్ టెస్టు: మూడో సెషన్ వరుణుడిదే

author img

By

Published : Jan 16, 2021, 12:40 PM IST

బ్రిస్బేన్ టెస్టు రెండో రోజు ఆట పూర్తయింది. రెండో సెషన్ టీ విరామం తర్వాత నుంచి వర్షం పడుతూనే ఉంది. దీంతో ఈ రోజుకు మ్యాచ్​ను నిలిపేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.

IND vs AUS: Rain delays start of play in post-tea session on second day
భారత్-ఆసీస్ టెస్టు: మూడో సెషన్ వరుణుడిదే

టీమ్​ఇండియా- ఆస్ట్రేలియా నాలుగో టెస్టుకు వరుణుడు అడ్డంకిగా నిలిచాడు. రెండో రోజు ఆగకుండా కురుస్తున్న వర్షం కారణంగా భారత్ తొలి ఇన్నింగ్స్‌ బ్యాటింగ్ నిలిచిపోయింది. రెండో సెషన్‌ పూర్తయ్యేసరికి 62/2తో ఉంది. క్రీజులో పుజారా(8), రహానె(2) ఉన్నారు.

అంతకుముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 369 పరుగులకు ఆలౌటైంది. అనంతరం టీమ్​ఇండియా క్రికెటర్లు శుభ్‌మన్‌ గిల్‌(7), రోహిత్‌(44) ఔటయ్యారు. దీంతో టీ విరామానికి భారత్‌ 62/2తో నిలిచింది. ఆపై వర్షం కురవడం వల్ల మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.