ETV Bharat / sports

సిడ్నీ టెస్టు: ఆగని వర్షం.. ముందే భోజన విరామం

author img

By

Published : Jan 7, 2021, 7:38 AM IST

సిడ్నీ టెస్టుకు వరుణుడు అడ్డంకిగా నిలిచాడు. దీంతో అరగంట ముందుగానే భోజన విరామాన్ని తీసుకున్నారు. ప్రస్తుతం 21/1ఉంది ఆస్ట్రేలియా.

IND vs AUS 3rd Test: Early lunch taken as rain stops play
ఇండియా ఆస్ట్రేలియా మూడో టెస్టు లైవ్

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి రోజు ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో భోజన విరామ సమయాన్ని అరగంట ముందుగా తీసుకున్నారు. అప్పటికి ఆస్ట్రేలియా స్కోర్‌ 21/1గా నమోదైంది.

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆ జట్టుకు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాయం నుంచి కోలుకొని తిరిగి మూడో టెస్టు ఆడుతున్న ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌(5)ను పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ బోల్తాకొట్టించాడు. వికెట్లకు దూరంగా వెళ్తున్న బంతిని ఆడటం వల్ల వార్నర్‌ పుజారా చేతికి చిక్కాడు. దీంతో ఆ జట్టు 6 పరుగులకే తొలి వికెట్‌ కోల్పోయింది. అనంతరం విల్‌ పకోస్కీ(14)తో కలిసి మార్నస్‌ లబుషేన్‌(2) బ్యాటింగ్‌ కొనసాగిస్తున్నాడు. వీరిద్దరూ 7.1 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 21 పరుగులు చేశారు. అదే సమయంలో వర్షం కురవడం వల్ల ఆటను నిలిపివేశారు. బుమ్రా 4 ఓవర్లు బౌలింగ్‌ చేయగా, సిరాజ్‌ 3.1 ఓవర్లలో ఒక వికెట్‌ పడగొట్టాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.