ETV Bharat / sports

మెల్​బోర్న్​లోనే భారత్-ఆసీస్  బాక్సింగ్ డే టెస్టు!

author img

By

Published : Aug 8, 2020, 3:41 PM IST

భారత్​-ఆస్ట్రేలియా బాక్సింగ్​ డే టెస్టు వేదికపై ఇంకా సందిగ్ధం కొనసాగుతోంది. కరోనా నేపథ్యంలో మెల్​బోర్న్​లో జరగాల్సిన మ్యాచ్​ను అడిలైడ్​కు మార్చుతారని వార్తలు వచ్చాయి. అయితే వేదికపై తుది నిర్ణయం తీసుకోవడానికి ఇంకా సమయం ఉందని స్పష్టం చేసింది క్రికెట్​ ఆస్ట్రేలియా.

Boxing Day Test to stay at MCG if crowd can come, says CA chief executive
జనాలొస్తే మెల్​బోర్న్​లోనే బాక్సింగ్​ డే టెస్టు

ఆస్ట్రేలియాలో బాక్సింగ్ డే టెస్టును మెల్​బోర్న్​లో నిర్వహించడం ఆనవాయితీ. అయితే ఈ ఏడాది భారత్​తో సిరీస్​లో భాగంగా బాక్సింగ్​ డే టెస్టుకు అడిలైడ్​ ఆతిథ్యం ఇచ్చే అవకాశముందని వార్తలు వచ్చాయి. వీటిపై స్పందించిన ఆస్ట్రేలియా బోర్డు.. ఆ మ్యాచ్​ వేదికపై నిర్ణయం తీసుకోవడానికి చాలా సమయం ఉందని తెలిపింది. టెస్టు జరిగే సమయానికి పరిస్థితులు చక్కబడతాయని ఆశాభావం వ్యక్తం చేసింది.

"ప్రస్తుతం చాలా ఆంక్షలు ఉన్నాయి. అయితే ఈ పరిస్థితి నుంచి త్వరగా బయటపడతాం. ప్రజలు కూడా బయటకు వస్తారు. లైవ్​ ఈవెంట్లు నిర్వహిస్తాం. బాక్సింగ్​ డే టెస్టు నాటికి సాధారణ పరిస్థితులు వస్తాయని అనుకుంటున్నాం. అదే జరిగితే మెల్​బోర్న్​లోనే బాక్సింగ్​ డే మ్యాచ్​ జరుగుతుంది"

- క్రికెట్​ ఆస్ట్రేలియా

ఇప్పటికే మెల్​బోర్న్​ నగరం ఉన్న విక్టోరియా రాష్ట్రంలో 13 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. అడిలైడ్​ రాజధానిగా ఉన్న దక్షిణ ఆస్ట్రేలియాలో 457 కేసులే నమోదు కాగా.. 445 మంది కోలుకున్నారు. షెడ్యూల్​ ప్రకారం డిసెంబర్​ 3న బ్రిస్బేన్​లో తొలి టెస్టుతో భారత్​-ఆస్ట్రేలియా మధ్య నాలుగు టెస్టుల సిరీస్​ ఆరంభమవుతుంది. గబ్బా, అడిలైడ్​, మెల్​బోర్న్​, సిడ్నీ వేదికగా మ్యాచ్​లు జరగనున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.