ETV Bharat / sports

ఆ వార్తలు విన్నాక నవ్వొచ్చింది: స్మిత్​

author img

By

Published : Jan 8, 2021, 5:45 PM IST

Updated : Jan 8, 2021, 9:37 PM IST

టీమ్ఇండియాతో జరిగిన రెండు టెస్టుల్లో పరుగులేవి చేయలేకపోయినా.. మూడో టెస్టులో రాణించడం చాలా ఆనందాన్నిచ్చిందని అన్నాడు ఆస్ట్రేలియా బ్యాట్స్​మన్​ స్టీవ్​స్మిత్​. తాను ఫామ్​లో లేనని వస్తున్న వార్తలు వింటుంటే నవ్వు వస్తుందని మ్యాచ్ అనంతరం జరిగిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

Being faster on feet, putting concerted pressure on Ashwin worked: Smith
ఆ వార్తలు విన్నాక నవ్వొచ్చింది: స్మిత్​

వేగవంతమైన ఫుట్‌వర్క్‌తో ముందుగానే దాడికి దిగడం రవిచంద్రన్‌ అశ్విన్‌పై బాగా పనిచేసిందని ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్‌స్మిత్‌ అన్నాడు. తన వ్యూహంతో అతడిపై ఒత్తిడి తీసుకొచ్చానని తెలిపాడు. మూడు వారాల క్రితమే రెండు శతకాలు బాదిన తనను ఫామ్‌లో లేనని అనడం నవ్వు తెప్పించిందని పేర్కొన్నాడు. ఏదేమైనప్పటికీ మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో మరికొన్ని పరుగులు చేయాల్సిందని వెల్లడించాడు. శతకం చేసిన తర్వాత అతడు మీడియాతో ఈ విధంగా మాట్లాడాడు.

వర్చువల్​గా మీడియాతో మాట్లాడుతున్న స్టీవ్​స్మిత్

"మరింత సానుకూలంగా ఉండాలని నిర్ణయించుకున్నా. బౌలింగ్‌కు రాగానే అశ్విన్‌ తల మీదుగా షాట్లు ఆడాను. నాకిష్టమైన చోట బంతులు వేయించేలా అతడిపై ఒత్తిడి పెంచాను. వ్యూహం ఫలించినందుకు, పరుగులు చేసినందుకు ఆనందంగా ఉంది. స్పిన్నర్ల బౌలింగ్‌లోనే వేగంగా కదిలాను. పేసర్లను ఎప్పట్లాగే ఎదుర్కొన్నా. ఈ మ్యాచ్‌లో నేను కాస్త దూకుడుగా ఆడాను. ఆరంభంలో బంతికో పరుగు చొప్పున చేయడం వల్ల మంచి ఇన్నింగ్స్‌ను నిర్మించాను. మూడు వారాల క్రితమే సిడ్నీ మైదానంలో వరుస శతకాలు చేసిన తనను ఫామ్‌ కోల్పోయానని విమర్శించడం నవ్వు తెప్పించింది. తొలి రెండు టెస్టుల్లో పరుగులు చేయలేకపోయాను. మూడో టెస్టులో పుంజుకొని శతకం చేయడం వల్ల జట్టు మెరుగైన స్థితిలోనే నిలిచిందని అనుకుంటున్నా. మేం మెరుగైన స్కోరే చేశాం. ఇంకొన్ని పరుగులు చేస్తే బాగుండేది. రెండోరోజు సాయంత్రం బౌలర్లు చక్కగా బంతులు విసిరి రెండు వికెట్లు తీశారు. రేపు ఏం జరుగుతుందో చూడాలి. ఎంసీజీ నాకెంతో ప్రత్యేకమైన మైదానం. ఇక్కడ ఆడటాన్ని నేను ఆస్వాదిస్తాను."

- స్టీవ్​స్మిత్​, ఆస్ట్రేలియా బ్యాట్స్​మన్​

క్వీన్స్‌లాండ్‌లో మూడు రోజుల లాక్‌డౌన్‌ విధించినా గబ్బాలో నాలుగో టెస్టు జరుగుతుందని స్మిత్‌ ధీమా వ్యక్తం చేశాడు. "గబ్బాలో టీమ్‌ఇండియాతో తలపడటం మాకిష్టమే. నాకు తెలిసినంత వరకు మార్పులేమీ ఉండకపోవచ్చు. అయితే నిర్ణయం తీసుకొనేది మేం కాదు. బోర్డులు చెప్పిన చోటికి వెళ్లి ఆడటమే ఆటగాళ్ల పని. ఏదేమైనా గబ్బాలో ఆడటాన్ని మేం ఆస్వాదిస్తాం" అని స్మిత్​ పేర్కొన్నాడు.

అయితే రెండోసారి కఠిన నిబంధనలు పాటించేందుకు టీమ్‌ఇండియా ఇష్టపడటం లేదు. దాంతో సడలింపులు ఇవ్వాలని బీసీసీఐ.. క్రికెట్‌ ఆస్ట్రేలియాకు లేఖ రాసింది.

ఇదీ చూడండి: టీమ్ఇండియా పాలిట ఆపద్బాంధవుడు జడ్డూ!

Last Updated : Jan 8, 2021, 9:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.