ETV Bharat / sports

కివీస్, సఫారీలతో టీ20 సిరీస్​కు బీసీసీఐ ప్రయత్నాలు!

author img

By

Published : Mar 18, 2021, 10:54 AM IST

ఈ ఏడాది టీ20 ప్రపంచకప్​నకు ముందు భారత జట్టుకు మరింత ప్రాక్టీస్ అవసరమని భావిస్తోందీ బీసీసీఐ. అందుకోసం ఈ మెగాటోర్నీకి ముందు న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాలతో టీ20 సిరీస్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది.

INDia
టీమ్ఇండియా

ఈ ఏడాది భారత్​లో టీ20 ప్రపంచకప్​ జరగబోతుంది. అయితే ఈ టోర్నీకి ముందు టీమ్ఇండియాకు ఐపీఎల్ తప్ప మరే ఇతర ద్వైపాక్షిక టీ20 సిరీస్​లు లేవు. కాగా, తాజాగా ఈ విషయంపై స్పందించిన బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు ఐపీఎల్ తర్వాత న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాలతో టీ20 సిరీస్​లు నిర్వహించే ప్రణాళికల్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే దీనిపై స్పష్టత వస్తుందని వెల్లడించారు.

"టీ20 ప్రపంచకప్​ కంటే ముందు దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు భారత్​లో టీ20 సిరీస్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇంకా తేదీలు ఖరారు కాలేదు. మెగాటోర్నీ ప్రారంభానికి ముందు భారత్​కు టీ20ల్లో తగినంత ప్రాక్టీస్ అవసరమని బోర్డు భావిస్తోంది"

-బీసీసీఐ అధికారి

భారత్-దక్షిణాఫ్రికా మధ్య ఇప్పటికే ఓ సిరీస్ ప్రతిపాదన ఉంది. మార్చిలో కరోనా వల్ల వాయిదా పడిన సిరీస్​ స్థానంలో మరో సిరీస్ నిర్వహించాల్సి ఉంది. ప్రస్తుతం ఇంగ్లాండ్​తో జరుగుతోన్న టీ20 సిరీస్ తర్వాత ఈ ఫార్మాట్​లో భారత్​కు మరో టీ20 సిరీస్ లేదు.

INDia
టీమ్ఇండియా

ఐపీఎల్ తర్వాత భారత జట్టు టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్, ఇంగ్లీష్ జట్టుతో ఐదు టెస్టు మ్యాచ్​లు ఆడేందుకు ఇంగ్లాండ్ పయనమవనుంది. తిరిగి స్వదేశానికి సెప్టెంబర్​ మధ్యలో రానుంది. ఈ ఏడాది జరగాల్సిన ఆసియా కప్ కూడా సందిగ్ధంలో పడింది. వాయిదా పడిన పాకిస్థాన్ సూపర్ లీగ్ నిర్వహణతో పాటు భారత్​ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ ఆడాల్సి రావడం ఇందుకు కారణం.

ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ తర్వాత స్వదేశంలో న్యూజిలాండ్​తో టెస్టు సిరీస్​లో పాల్గొననుంది టీమ్ఇండియా. ఆ తర్వాత డిసెంబర్-జనవరిలో దక్షిణాఫ్రికా పయనమై.. అక్కడ టెస్టు, పరిమిత ఓవర్ల సిరీస్ ఆడనుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.