గృహహింస కేసులో భారత క్రికెటర్ మహ్మద్ షమికి అరెస్టు వారెంట్ జారీ అయింది. 15 రోజుల్లోగా హాజరు కావాలని బంగాల్‌కు చెందిన అలిపోరే కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్నాడీ బౌలర్.
హసీన్ జహన్.. తన భర్త షమితో పాటు అతని తమ్ముడు తనను వేధించారని చెబుతూ గతేడాది గృహహింస కేసు పెట్టింది. అనంతరం సామాజిక మాధ్యమాల్లోనూ భార్యభర్తలు ఇద్దరూ పరోక్షంగా ఒకరిని ఒకరు విమర్శించుకున్నారు.
![hasi jahan-mhmd shami](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4314493_shami.jpg)
మహ్మద్ షమి.. టీమిండియా అత్యుత్తమ బౌలర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. ఇటీవలే జరిగిన ప్రపంచకప్‌లో తనదైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మొత్తంగా 70 వన్డేల్లో 131 వికెట్లు తీశాడు. టెస్టుల్లో 42 మ్యాచ్‌లాడి 150 వికెట్లు పడగొట్టాడు.
ఇది చదవండి: తుపాకీలా టెన్నిస్ రాకెట్‌తో స్టిల్- ఆటగాడికి భారీ ఫైన్