ETV Bharat / sports

క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓగా నిక్ హోక్లే

author img

By

Published : May 31, 2021, 11:57 AM IST

క్రికెట్ ఆస్ట్రేలియా(Cricket Australia) తాత్కాలిక సీఈఓ నిక్ హోక్లే శాశ్వత కార్యనిర్వాహక అధ్యక్షుడిగా సోమవారం నియామకమయ్యారు. ఈ విషయాన్ని ఆసీస్​ క్రికెట్​ బోర్డు అధికారికంగా ప్రకటించింది.

nick
నిక్ హోక్లే

ఏడాది పాటుగా క్రికెట్​ ఆస్ట్రేలియా(సీఏ) తాత్కాలిక కార్యనిర్వాహక అధ్యక్షుడిగా(సీఈఓ) వ్యవహరిస్తున్న నిక్ హోక్లేను శాశ్వత సీఈఓగా నియమించింది ఆసీస్ క్రికెట్ బోర్డు. కరోనా సమయంలో అంతర్జాతీయ, దేశవాళీ మ్యాచ్​లను విజయవంతంగా జరపడం సహా విధులను సమర్థవంతంగా నిర్వహించారు నిక్​. ఈ నేపథ్యంలోనే ఆయనకు ఈ బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది బోర్డు. తనకు సీఈఓగా పూర్తి స్థాయిలో బాధ్యతలు అప్పగించడంపై నిక్​ హర్షం వ్యక్తం చేశారు.

హోక్లేకు.. 2020 ఐసీసీ టీ20 ప్రపంచకప్​ సీఈఓగా, 2015 ప్రపంచకప్​ మార్కెటింగ్​, కమర్షియల్​ వ్యవహార బాధ్యతలు చేపట్టిన అనుభవం ఉంది.

ఇదీ చూడండి: 'మా వాళ్లను క్షేమంగా పంపారు.. థ్యాంక్యూ బీసీసీఐ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.