ETV Bharat / sports

Virat Kohli: ఆ ధర చూసి ఆశ్చర్యపోయా: విరాట్ కోహ్లీ

author img

By

Published : Feb 1, 2022, 5:38 PM IST

Virat Kohli
విరాట్ కోహ్లీ

Virat Kohli: 2008లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు ఎంపికైనప్పుడు తనని కొనుగోలు చేసిన ధర చూసి ఆశ్చర్యపోయానని చెప్పాడు మాజీ సారథి విరాట్ కోహ్లీ. తనను తాను ఆర్సీబీలో తప్ప మరే జట్టులోనూ చూడాలనుకోవడంలేదని అన్నాడు.

Virat Kohli: ఐపీఎల్‌ భారత క్రికెట్‌కే తలమానికం. ఈ మెగా ఈవెంట్‌తో దేశంలో క్రికెట్‌కు ఉన్న క్రేజ్‌ మరోస్థాయికి చేరింది. దేశవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది ప్రతిభావంతులు.. తమనుతాము నిరూపించుకొనేందుకు సరైన వేదికగా మారింది. ఇక్కడ అవకాశం వచ్చి ఒక్కసారి క్లిక్‌ అయితే ఆటగాళ్ల దశ-దిశ మారిపోతుంది. దీంతో ప్రతి ఒక్కరూ ఈ మెగా ఈవెంట్‌లో ఆడాలనుకుంటారు. ప్రస్తుతం టీమ్‌ఇండియాలో స్టార్లుగా కొనసాగుతున్న చాలా మంది ఆటగాళ్లు సైతం ఈ మెగా ఈవెంట్‌ నుంచే వెలుగులోకి వచ్చారు. అందులో బ్యాటింగ్‌ గ్రేట్‌, మాజీ సారథి విరాట్‌ కోహ్లీ సైతం ఉన్నాడు. అతడు తొలిసారి 2008లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు ఎంపికైనప్పుడు తనని కొనుగోలు చేసిన ధర చూసి ఆశ్చర్యపోయానని చెప్పాడు.

Virat Kohli
దేవ్​దత్ పడిక్కల్, కోహ్లీ

ఇటీవలే ఆర్సీబీ జట్టు తమ క్రికెటర్లతో ఓ ఆసక్తికరమైన వీడియోను అభిమానులతో పంచుకుంది. అందులో ఐపీఎల్‌ తమ కెరీర్‌లను ఎలా మార్చిందని విరాట్‌ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, మహ్మద్‌ సిరాజ్‌, దేవ్‌దత్‌ పడిక్కల్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌లను అడిగింది. ఈ క్రమంలోనే కోహ్లీ మాట్లాడుతూ తన ఐపీఎల్‌ ఎంట్రీపై ఇలా చెప్పుకొచ్చాడు. '2008లో ఐపీఎల్‌ వేలం జరిగేటప్పుడు మేమంతా అండర్‌-19 ప్రపంచకప్‌ కోసం మలేసియాలో ఉన్నాం. ఆ రోజు నాకింకా గుర్తుంది. అప్పుడు మమ్మల్ని ఎంత ధరకు తీసుకోవాలని నిర్ణయించారో తెలిసి ఆశ్చర్యపోయాం. ఎందుకంటే అది చాలా పెద్ద మొత్తం. అయితే, నన్ను దిల్లీ టీమ్‌ తీసుకోవాలని చూసినా వాళ్ల పరిస్థితులకు పేస్‌ బౌలర్‌ను తీసుకోవాలనుకున్నారు. దాంతో అప్పుడు మా అండర్‌-19లోని అత్యుత్తమ బౌలర్‌ ప్రదీప్‌ సాంగ్వాన్‌ను తీసుకున్నారు. నేనేమో ఆర్సీబీకి వెళ్లాను' అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

'బెంగళూరు టీమ్‌ నన్ను తీసుకోవడం నా జీవితంలోనే ప్రత్యేకమైన సందర్భం. దాంతో ఈ స్థాయికి చేరుకుంటానని అస్సలు ఊహించలేదు. ఇప్పుడు తిరిగి వెనక్కి చూసుకుంటే నాటి పరిస్థితులు మరోలా ఉన్నాయనిపిస్తోంది. అలాగే నన్ను నేను ఆర్సీబీలో తప్ప మరే జట్టులోనూ చూడాలనుకోవడం లేదు. నాకు మాటల ఊరట కన్నా నిజాయితీగా ఉండటమే ముఖ్యం. నేను ఐపీఎల్‌ ఆడే చివరి రోజు వరకూ ఈ జట్టులోనే కొనసాగుతా' అని మాజీ సారథి వివరించాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇవీ చదవండి:

'నాయకుడిగా ఉండాలంటే.. కెప్టెనే​ కానక్కర్లేదు'

'కెప్టెన్​గా కోహ్లీ సక్సెస్.. అతడు మాత్రం ఫెయిల్'

'కోహ్లీ కెప్టెన్సీ వదులుకోవడం.. భారత్‌కు పెద్ద ఎదురుదెబ్బ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.