ETV Bharat / sports

'నాయకుడిగా ఉండాలంటే.. కెప్టెనే​ కానక్కర్లేదు'

author img

By

Published : Jan 31, 2022, 5:14 PM IST

Virat Kohli Leadership Qualities: జట్టులో నాయకుడిగా ఉండాలంటే.. కెప్టెనే కానక్కర్లేదన్నాడు టీమ్​ఇండియా మాజీ సారథి విరాట్​ కోహ్లీ. తాను జట్టులో సభ్యుడిగా ఉన్నప్పుడు కూడా కెప్టెన్​లానే ఆలోచిస్తానని తెలిపాడు.

Virat Kohli
Virat Kohli

Virat Kohli Leadership Qualities: నాయకత్వంపై టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​ విరాట్​ కోహ్లీ కీలక వ్యాఖ్యలు చేశాడు. జట్టులో నాయకుడిగా ఉండాలంటే.. సారథిగానే ఉండాల్సిన పనిలేదని అభిప్రాయపడ్డాడు. జట్టులో ఆటగాడిగా ఉన్నప్పుడు కెప్టెన్‌లానే ఆలోచిస్తానని తెలిపాడు. ముందుగా తామేమి సాధించగలం.. దానిపై పూర్తి అవగాహన ఉండాలన్నాడు.

"నాయకుడిగా ఉండటానికి కెప్టెన్‌గా ఉండాల్సిన అవసరం లేదు. ఎంఎస్​ ధోని జట్టులో ఉన్నప్పుడు అతను నాయకుడిగా లేనట్లు కాదు. గెలుపోటములు మన చేతుల్లో ఉండవు. ప్రతిరోజు మెరుగ్గా ఉండాలనేది మన చేతుల్లో ఉండదు.. స్వల్పవ్యవధిలో చేయగలిగింది కాదు. జట్టులో ఉన్నన్నాళ్లు అది మన బాధ్యత. అలా ముందుకు సాగడం కూడా నాయకత్వంలో ఓ భాగమే. అన్ని రకాల బాధ్యతలు, అవకాశాలను స్వీకరించాలని భావిస్తాను. ధోని నేతృత్వంలో కొంతకాలం ఆడాను. తర్వాత కెప్టెన్​గా బాధ్యతలు చేపట్టాను. జట్టులో ఆటగాడిగా ఉన్నప్పటికీ కెప్టెన్‌గానే ఆలోచిస్తాను."

- విరాట్​ కోహ్లీ

'ముందుగా ఏమి సాధించాలనుకుంటున్నాం.. ఆ లక్ష్యాలను సాధించామా లేదా అనే దానిపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. ప్రతిదానికీ కాలపరిమితి ఉంటుందన్న విషయం తెలుసుకోవాలి. ప్రతిఒక్కరూ అనుకున్నదానికంటే మెరుగైన ప్రదర్శన చేయగలరు. అది గర్వించాల్సిన విషయం' అని కోహ్లీ పేర్కొన్నాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి: Australian Open: నాదల్​కు ప్రైజ్​మనీ ఎంతంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.