ETV Bharat / sports

'నేను అస్సలు ఊహించలేదు.. బుమ్రాకు అలా జరగడం అదే తొలిసారి'

author img

By

Published : Oct 28, 2022, 8:02 PM IST

టీ20 ప్రపంచకప్​కు బుమ్రా దూరమవ్వడంపై మాట్లాడాడు సీనియర్ క్రికెటర్​ భువనేశ్వర్​ కుమార్​. ఏం అన్నాడంటే..

బుమ్రాపై భువనేశ్వర్​ షాకింగ్​ కామంట్​
bhuvaneshwar comment on bumrah

టీమ్​ఇండియా స్టార్​ పేసర్ బుమ్రా​ ​ వెన్నునొప్పి కారణంగా టీ20 వరల్డ్​కప్​కు దూరమయ్యాడన్న సంగతి తెలిసిందే. అయినా మిగతా బౌలర్లు ఈ మెగాటోర్నీలో బాగానే రాణిస్తున్నారు. ఇప్పటికే భారత జట్టు వరుసగా రెండు విజయాలను అందుకుని దక్షిణాఫ్రికాతో మూడో మ్యాచ్​కు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో బుమ్రా జట్టుకు దూరమవ్వడంపై సీనియర్ క్రికెటర్ భువనేశ్వర్​ మాట్లాడాడు.

అతడు మాట్లాడుతూ.. "బుమ్రా లాంటి బౌలర్​ దూరమవ్వడం జట్టుకు భారీ లోటు. కానీ, ప్రస్తుతం టీమ్​లో ఉన్న బౌలింగ్​ యూనిట్​ బాగానే రాణిస్తోంది. మేం బుమ్రా గురించి ఎక్కువగా ఆలోచించకుండా మాకున్న బలం, ప్రణాళికలతో ముందుకు సాగుతాం. అతడు ఒక రిదమ్ ఉన్న ప్లేయర్.. అద్భుతంగా ఆడతాడు. గతంలో పాకిస్థాన్​ను తన స్వింగ్​ బౌలింగ్​తో ఒత్తిడికి గురిచేశాడు. ఆసియాకప్​ సమయంలో బుమ్రా డెత్​ బౌలింగ్​ విషయంలో చాలా విమర్శలు వచ్చాయి. ​ఇన్నీ సంవత్సరాల్లో అలా ఒక్క సారి మాత్రమే జరిగింది. మీడియా, కామెంటేటర్​లు చాలా అంటుంటారు. కానీ ఓ జట్టుగా మాలో ఎలాంటి లోటుపాట్లు ఉన్నాయో.. మేము సరిచేసుకోగలం. అయితే అసియాకప్​ అనేది ఓ పెద్ద మెగాటోర్నీ కాబట్టి అభిమానులు సాధారణంగానే మామీద ఎక్కువ అంచనాలు పెట్టుకుంటారు. నిజానికి టీ20 ఫార్మాట్​లో బ్యాటర్లు, బౌలర్లకు కాస్త కష్టమైనదే. పెద్ద టోర్నీల్లో ఆడేటప్పుడు సోషల్​ మీడియాకు చాలా దూరంగా ఉంటాను. మరీ ముఖ్యంగా ప్రపంచకప్​ అప్పుడు సోషల్​ మీడియా జోలికి అస్సలు పోను. దానిలో ఏం వస్తున్నాయో కూడా తెలీదు. ఇక పాకిస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో రిజ్వాన్​కు వెసిన బంతులు అంత స్వింగ్ అవుతాయని అస్సలు ఊహించలేదు. నేను, అర్షదీప్​ చెరో రెండు వికెట్లు తీశాం. అర్షదీప్​కు తన అరంగేట్రం నుంచి అద్భుతంగా ఆడుతున్నాడు. పిచ్​లు, వాటిపై బ్యాటర్లు ఆడే షాట్స్ గురించి ఎప్పుడూ నన్ను, కోహ్లీ, రోహిత్​ను అడిగి తెలుసుకుంటుంటాడు" అని పేర్కొన్నాడు.

ఇదీ చూడండీ: జింబాబ్వే సూపర్​ విక్టరీ.. ఒక్క ట్వీట్​తో పాక్ గాలి తీసిన ఆ దేశ అధ్యక్షుడు!

'వాళ్లకు ఆ ఇద్దరు పేసర్లుంటే మాకు విరాట్‌ భాయ్‌ ఉన్నాడుగా!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.