ETV Bharat / sports

Asia Cup 2023 IND VS PAK : రిజర్వ్​డే ఆట మొదలైంది.. కానీ వర్షం పడితే పరిస్థితేంటి?

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 11, 2023, 5:16 PM IST

Asia Cup 2023 IND VS PAK : రిజర్వ్​డే ఆట మొదలైంది.. కానీ వర్షం పడితే పరిస్థితేంటి?
Asia Cup 2023 IND VS PAK : రిజర్వ్​డే ఆట మొదలైంది.. కానీ వర్షం పడితే పరిస్థితేంటి?

Asia Cup 2023 IND VS PAK Super 4 Points Table : టీమ్​ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్ రిజర్వ్‌ డేకు వెళ్లింది. అయితే నేటి(సెప్టెంబర్ 11) మ్యాచ్‌కూ వర్షం ఆటంకం కలిగిస్తే పరిస్థితి ఏంటి..? తెలుసుకుందాం..

Asia Cup 2023 IND VS PAK : వర్షం కారణంగా నిన్న(సెప్టెంబర్ 10) ఆగిపోయిన టీమ్​ఇండియా-పాకిస్థాన్ సూపర్ 4 మ్యాచ్​ ఎట్టకేలకు రిజర్వ్​ డే అయిన నేడు(సెప్టెంబర్ 11) ప్రారంభమైంది. అయితే కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది. పిచ్​ను బాగా పరిశీలించి ఓవర్లలో ఎలాంటి కోత లేకుండా మ్యాచ్​ను షురూ చేశారు అంపైర్లు. నిన్న 24.1 ఓవర్ల వద్ద మ్యాచ్‌ ఆగిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఇవాళ మిగిలిన ఆ ఓవర్‌ను షాదాబ్‌ వేశాడు. క్రీజ్‌లోకి కేఎల్ రాహుల్, కోహ్లీ వచ్చి బ్యాటింగ్ చేశారు. వర్షం కారణంగా పిచ్‌ కాస్త బౌలింగ్‌కు అనుకూలిస్తోంది. దీంతో భారత బ్యాటర్లూ రిస్క్‌ తీసుకోకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు.

Super 4 Points Table Asia Cup 2023 : అయితే నేడు కూడా వర్షం అంతరాయం కలిగించే సూచనలు ఉన్నట్లు వాతావరణ నివేదికలు చెబుతున్నాయి. మరి ఒకవేళ వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దైతే పరిస్థితి ఏంటి? సూపర్‌ 4 పాయింట్ల పట్టికలో ఆయా జట్ల సమీకరణాలు ఎలా ఉంటాయి.. తెలుసుకుందాం..

  • సూపర్‌ 4 దశలో ఉన్న ఆయా టీమ్స్​.. మిగతా మూడింటితో ఒక్కో మ్యాచ్​లో పోటీపడతాయి. ప్రస్తుతం పాకిస్థాన్‌, శ్రీలంక పాయింట్ల పట్టికలో రెండేసి పాయింట్లతో మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. నెట్‌ రన్‌రేట్‌ ఆధారంగా ప్రస్తుతానికి పాక్‌ అగ్ర స్థానంలో ఉంది. రెండు మ్యాచ్‌ల్లో ఓడిన బంగ్లాదేశ్​ నాలుగో స్థానంలో నిలిచింది.
  • సూపర్‌ 4 దశలో టీమ్‌ఇండియాకు ఇప్పుడు పాకిస్థాత్​తో జరిగేదే తొలి మ్యాచ్‌. ఒకవేళ ఈ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైతే.. భారత్‌, పాకిస్థాన్‌లకు చెరో పాయింట్‌ పంచుకుంటాయి. అప్పుడు పాక్‌ 3 పాయింట్లతో మళ్లీ అగ్రస్థానంలోనే కొనసాగుతుంది. భారత్‌ ఒక పాయింట్‌ అందుకుని మూడో స్థానంలో నిలుస్తుంది.
  • ఇక ఈ మ్యాచ్‌ రద్దైతే.. ఇక టీమ్​ఇండియా పరిస్థితి కష్టంగా మారుతుంది. తర్వాతి రెండు మ్యాచుల్లో టీమ్​ఇండియా కనీసం ఒకదానిలోనైనా గెలవకపోతే పరిస్థితి దారుణంగా మారుతుంది. అప్పుడు టీమ్‌ఇండియాతో పోల్చితే శ్రీలంక మెరుగైన స్థితిలో ఉంటుంది.
  • టీమ్​ఇండియా తన నెక్ట్స్​ మ్యాచుల్లో లంక, బంగ్లాదేశ్‌లతో పోటీపడనుంది. ఆ మ్యాచ్‌లకు వర్షం అంతరాయం కలిగించదని చెప్పలేం. కాబట్టి పాక్‌తో జరుగుతున్న మ్యాచ్​లో భారత్​ గెలిచి తీరాలి.

Shoaib Akhtar On India Pakistan Match : బాబర్​ సేనపై అక్తర్ విమర్శలు.. ఈ సారి వర్షమే పాక్‌ను రక్షించిందంటూ..

Asia Cup 2023 Ind vs Pak : 'ఓ మై గాడ్'.. అలా జరిగితే టీమ్ఇండియాకు కష్టమే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.