ETV Bharat / sports

Asia Cup 2023 Ind vs Pak : సచిన్​-కోహ్లీ రికార్డులను సమం చేసిన రోహిత్​-కేఎల్​ రాహుల్​

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 10, 2023, 9:37 PM IST

Asia Cup 2023 Ind vs Pak : సచిన్​-కోహ్లీ రికార్డులను సమం చేసిన రోహిత్​-కేఎల్​ రాహుల్​
Asia Cup 2023 Ind vs Pak : సచిన్​-కోహ్లీ రికార్డులను సమం చేసిన రోహిత్​-కేఎల్​ రాహుల్​

Asia Cup 2023 Ind vs Pak Match : పాకిస్థాన్​తో జరుగుతున్న సూపర్ 4 మ్యాచ్​లో టీమ్​ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్.. సచిన్-కోహ్లీ రికార్డులను సమం చేశారు. ఆ వివరాలు..

Asia Cup 2023 Ind vs Pak Sachin Rohit Sharma : ఆసియా కప్‌-2023లో భాగంగా నేడు(సెప్టెంబర్‌ 10) పాకిస్థాన్ జరిగిన సూపర్‌-4 మ్యాచ్‌ రిజర్వ్​ డేకు వెళ్లింది. అయితే ఈ మ్యాచ్​లో టీమ్​ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. ఓ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఆసియా ‍కప్‌ వన్డే ఫార్మాట్‌లో క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్​ పేరిట ఉన్న ఓ రికార్డును అందుకున్నాడు. టీమ్ఇండియా తరఫున సచిన్ పేరు మీదున్న అత్యధిక హాఫ్‌ సెంచరీల రికార్డును సమం చేశాడు.

క్రికెట్ గాడ్​.. ఆసియా కప్‌ కెరీర్‌లో(వన్డేలు) మొత్తం 9 అర్ధ శతకాలు నమోదు చేశాడు. తాజాగా పాకిస్థాన్ జరిగిన మ్యాచ్​లో హాఫ్​ సెంచరీ బాదడం ద్వారా.. రోహిత్​(9) సచిన్‌ సరసన చేరాడు. ఈ అర్ధ శతకంతో రోహిత్‌ మరో రికార్డు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో 80 సార్లు 50కి పైగా స్కోర్లు(30 సెంచరీలు, 50హాఫ్ సెంచరీలు) చేసిన 13వ ప్లేయల్​గా నిలిచాడు. ఈ విషయంలో సచిన్‌ టాప్‌లో ఉన్నాడు. 145సార్లు 50 ప్లస్‌ స్కోర్లు చేశాడు. ఆ తర్వాత కోహ్లీ(111), ద్రవిడ్‌ (95), గంగూలీ (94), ధోని (83) రోహిత్‌కు ముందున్నారు.

ఇకపోతో ఈ మ్యాచ్​లో 56 పరుగులు చేసి ఔట్​ అయ్యారు రోహిత్‌. మరో 22 పరుగులు చేసుంటే, వన్డేల్లో 10, 000 పరుగుల మైలురాయిని అందుకునేవాడు. ప్రస్తుతం హిట్​ మ్యాన్​ 247 వన్డేల్లో 48.91 సగటు, 90.19 స్ట్రైక్​ రేట్​తో 9978 రన్స్ సాధించాడు.

KL Rahul Completes 2000 ODI Runs : కోహ్లీ రికార్డు సమం.. టీమ్​ఇండియా స్టార్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌.. మరో స్టార్ బ్యాటర్​ కోహ్లీ రికార్డును సమం చేశాడు. ఈ మ్యాచ్‌లో రాహుల్‌ 14 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద.. వన్డేల్లో 2000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. తన 53వ ఇన్నింగ్స్‌లో ఈ ఫీట్‌ను టచ్​ చేశాడు. మొత్తంగా న్డేల్లో ఫాస్టెస్ట్‌ 2000 పరుగుల రికార్డు హషీమ్‌ ఆమ్లా పేరిట ఉంది. ఆమ్లా 40 ఇన్నింగ్స్‌ల్లో ఈ మార్క్​ను అందుకున్నాడు. అలాగే టీమ్​ఇండియా తరఫున వన్డేల్లో అత్యంత వేగంగా 2000 పరుగులు సాధించిన రికార్డు శిఖర్‌ ధావన్‌ పేరిట ఉంది. ధావన్‌ 48 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ నమోదు చేశాడు. ధావన్ తర్వాత సిద్దూ (52), గంగూలీ (52) ఈ మార్క్​ను టచ్​ చేశారు. రాహుల్‌ కన్నా ముందు కోహ్లీ కూడా తన 53వ ఇన్నింగ్స్‌లోనే ఈ 2000 పరుగుల మార్కును అందుకున్నాడు.

Asia Cup 2023 Pak vs Bangladesh : 'టోర్నీమొత్తం చీకటిలో నిర్వహించేవారా?'.. PCBపై క్రికెట్ ఫ్యాన్స్ గరం!

Asia Cup 2023 Sl vs Ban : సూపర్​ 4 లో శ్రీలంక శుభారంభం.. రెండో ఓటమితో బంగ్లా ఫైనల్ ఆశలు సంక్లిష్టం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.