ETV Bharat / sports

'కోహ్లీ కూడా అంతే.. పుజారా, రహానేపైనే విమర్శలెందుకు?'

author img

By

Published : Jan 4, 2022, 7:22 PM IST

Ashish Nehra on Kohli: టీమ్​ఇండియా ఆటగాళ్లు ఛెతేశ్వర్​ పుజారా, అజింక్య రహానే పేలవ బ్యాటింగ్ ప్రదర్శనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇద్దరు బ్యాటర్ల ప్రదర్శనపై పలు వ్యాఖ్యలు చేశాడు మాజీ పేసర్ ఆశిష్​ నెహ్రా. వారిద్దరికంటే కోహ్లీ గణాంకాలేమీ భిన్నంగా లేవని అన్నాడు.

virat, rahane, pujara
పుజారా, విరాట్, రహానే

Ashish Nehra on Kohli: దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా టీమ్​ఇండియా మిడిలార్డర్ ప్రదర్శన పేలవంగా కొనసాగుతోంది. బ్యాటర్లు ఛెతేశ్వర్ పుజారా, అజింక్య రహానే మరోసారి విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో వారిని జట్టులో నుంచి తొలగించాలని అభిమానులు విమర్శిస్తున్నారు. సీనియర్​ క్రికెటర్లు సైతం.. పుజారా, రహానే బ్యాటింగ్ ప్రదర్శనపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిపై భారత మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా పలు వ్యాఖ్యలు చేశాడు.

"విరాట్​ కోహ్లీ గణాంకాలేమీ పుజారా, రహానే కంటే భిన్నంగా లేవు. కానీ, కోహ్లీ స్థానంపై ఎవ్వరూ ప్రశ్నించడంలేదు. ఒకప్పుడు విరాట్ మెరుగైన ఫామ్​ను కనబరిచాడు. ప్రస్తుతం పరుగులు చేయలేకపోతున్నాడు. విరాట్​ను పుజారా, రహానేతో పోల్చడం సరికాదు. కానీ, ఒకప్పుడు రహానే, పుజారా కూడా ఉత్తమంగా బ్యాటింగ్ చేశారు కదా."

--ఆశిష్ నెహ్రా, టీమ్​ఇండియా మాజీ బౌలర్.

భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్​ కూడా రహానే, పుజారా​ ఫామ్​పై విమర్శలు చేశాడు. జోహెన్నెస్​బర్గ్​ టెస్టు వారికి ఆఖరి మ్యాచ్​ అవుతుందని అభిప్రాయపడ్డాడు. ఈ నేపథ్యంలో అశిష్ నెహ్రా వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.

'న్యూజిలాండ్​తో తొలి టెస్టుకు రహానే సారథిగా వ్యవహరించాడు. అప్పుడు అతడికి అందరూ మద్దతుగా నిలిచారు. కానీ, రెండో టెస్టులో కోహ్లీ రాకతో అతడు జట్టుకు దూరమయ్యాడు. తొలి టెస్టులో రహానేకు మద్దతుగా నిలిస్తే.. సిరీస్​ మొత్తం అతడికి సపోర్ట్​గా ఉండాలి. దురదృష్టవశాత్తు అలా జరగలేదు' అని నెహ్రా తెలిపాడు. దక్షిణాఫ్రికాతో సిరీస్​లోనూ చివరివరకు రహానే, పుజారాకు అవకాశం ఇవ్వాలని అన్నాడు.

ఇదీ చదవండి:

వారిద్దరికీ ఇదే చివరి టెస్టు.. గావస్కర్ కీలక వ్యాఖ్యలు

Ashish Nehra IPL: అహ్మదాబాద్​ ఫ్రాంఛైజీ హెడ్​కోచ్​గా నెహ్రా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.