ETV Bharat / sports

Ashes series 2023 : బెయిర్ స్టో రనౌట్​.. 'నేనైతే అలా చేసేవాడిని కాదు'

author img

By

Published : Jul 3, 2023, 8:11 AM IST

Updated : Jul 3, 2023, 10:03 AM IST

Ashes series 2023 Jonny bairstow run : యాషెస్ సిరీస్ రెండో టెస్ట్​​ ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో బెయిర్‌స్టో ఔటైన విధానం వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అంతటా దీని గురించే పెద్ద ఎత్తు చర్చ సాగుతోంది.

Bairstow
Ashes series 2023 Jonny bairstow run :

Ashes series 2023 Jonny bairstow run : ఇంగ్లాండ్‌ రెండో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో బెయిర్‌స్టో ఔటైన విధానం వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అంతటా దీని గురించే పెద్ద ఎత్తు చర్చ సాగుతోంది. అయితే దీనిపై ఇంగ్లాండ్​ జట్టు కోచ్​ బ్రెండన్​ మెక్ కల్లమ్​, మరో ప్లేయర్​ స్టోక్స్​ మాట్లాడారు.

"ఇది క్రీడా స్ఫూర్తికి సంబంధించినది. అనుభవం పెరిగేకొద్ది, పరిణతి చెందినప్పుడు.. క్రీడా స్ఫూర్తిని సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందని అర్థమవుతుంది. క్షణంలో తీసుకునే నిర్ణయాలు, ఆటపై, అలాగే వ్యక్తులపై ప్రభావం చూపుతాయి. నిబంధనల ప్రకారం బెయిల్ స్టో ఔట్. అతడు పరుగు చేయడానికి ప్రయత్నించలేదు. అప్పుడే అంపైర్ ఓవర్ అయిపోయిందని ప్రకటించలేదు. జీర్ణీంచుకోవడానికి కష్టంగా ఉండే సంఘటనలలో ఇదీ ఒకటి. నన్ను చాలా నిరాశపరిచింది." అని మెక్ కలమ్​ అన్నాడు. ఈ ఔట్​ వల్ల ఇరు జట్ల మధ్య సత్సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉందని కూడా అన్నాడు.

"బెయిర్‌స్టో క్రీజులోనే ఉన్నాడు. ఆ తర్వాతే మాట్లాడానికి మధ్యలో క్రీజు వదిలి బయటకు వచ్చాడు. అది ఔట్ కాదు అని నేను అనట్లేదు. అది ఔటే. ఒకవేళ నేను అతడి స్థానంలో ఉన్నప్పుడు ఇలా జరిగి ఉంటే.. నేను ఇంత వివాదంగా మార్చను. క్రీడా స్ఫూర్తి గురించి లోతుగా ఆలోచించి, నేను అలానే చేయాలనుకుంటున్నాను." అని స్టోక్స్ అసహనం వ్యక్తం చేశాడు.

బెయిర్ స్టో ఔట్​ పట్ల ఆసిస్ కెప్టెన్ కమిన్స్​ స్పందిస్తూ.. రూల్స్ ప్రకారం అది కచ్చితంగా ఓటేనని చెప్పుకొచ్చాడు. ' బెయిర్ స్టో ఔటైన విధానం క్రికెట్​లో చాలా అరుదు. మేము అతడిని ఔట్​ చేసిన దాంట్లో ఎలాంటి తప్పిదం లేదు. బెయిర్ స్టో ప్రతీ బంతికి క్రీజు దాటుతున్నాడు. అలా అతడు నాలుగు, ఐదు సార్లు చేశాడు. క్రికెట్​లో బ్యాటింగ్​కు వచ్చినప్పుడు కచ్చితంగా క్రీజులో ఉండాల్సిందే. ఇంగ్లాండ్​ జట్టుపై మాకు ఎలాంటి దురుద్దేశం లేదు. మేము వారితో ఎప్పటికీ సన్నిహితంగానే ఉంటాం' అని కమిన్స్ అన్నాడు.

ashes series 2023 aus vs eng : ఇదీ జరిగింది.. ఈ మ్యాచ్​లో ఆట చివరి రోజు మొదటి సెషన్​లో ఆతిథ్య జట్టు 193/5గా ఉంది. ఈ సమయంలో క్రీజులో ఉన్న బెయిర్ స్టో.. గ్రీన్‌ వేసిన బౌన్సర్‌ను తప్పించుకునేందుకు కిందకు వంగాడు. బంతి నేరుగా వికెట్‌ కీపర్‌ చేతుల్లోకి వెళ్లింది. అయితే ఓవర్‌ పూర్తయిందనే ఉద్దేశంతో అతడు క్రీజు దాటాడు. వెంటనే వికెట్‌ కీపర్‌ కేరీ.. బంతితో స్టంప్స్ పడగొట్టాడు. దీంతో ఆసిస్ ప్లేయర్​లున అప్పీల్‌ చేశారు. అంతే ఒక్కసారిగా బెయిర్‌స్టో, స్టోక్స్‌తో పాటు ఇంగ్లాండ్‌ క్రికెటర్లు, స్టేడియంలోని ప్రేక్షకులు ఆశ్చర్యపోయి అయోమయానికి గురయ్యారు. బెయిర్​ స్టో పరుగు కోసం ప్రయత్నించలేదని స్పష్టంగా తెలుసు కాబట్టి థర్డ్ అంపైర్ దాన్ని ఔట్​గా పరిగణించడని అనుకున్నారంతా. కానీ అది ఫెయిర్ డెలివరీగా భావించిన థర్డ్ అంపైర్ అతడు ఔట్ అని తన నిర్ణయాన్ని ప్రకటింటాడు. ఈ ప్రకటనతో ఆసిస్ ఆటగాళ్లు సంబరాలు చేసుకోగా.. షాక్​కు గురవ్వడం ఇంగ్లాండ్ ప్లేయర్ల వంతైంది. అప్పటికే ఆసిస్ కెప్టెన్​తో స్టోక్స్​ మాట్లాడినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. కాగా ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమంటూ ఆస్ట్రేలియాపై పలువురు నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇక స్టేడియంలోని ఇంగ్లాండ్‌ ఫ్యాన్స్.. ఆసీస్‌ను హేళన చేస్తూ కోపంతో చాలాసేపు అరిచారు. అయితే బెయిర్ స్టో ఔట్​ అయ్యాక.. స్టోక్స్ సిక్సర్లతో చెలరేగాడు. కానీ ఆఖర్లో స్టోక్స్​కూడా పెవిలియన్ చేరడం వల్ల ఆసిస్ 43 పరుగులతో నెగ్గింది. కాగా బెయిర్​ స్టో ఔట్ కాకపోయి ఉంటే ఫలితం వేరుగా ఉండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదీ చూడండి :

వరల్డ్​ కప్​నకు​ అర్హత సాధించిన శ్రీలంక.. రేసు నుంచి జింబాబ్వే ఔట్​

కెవిన్​ వ్యాఖ్యలకు లైయన్​ కౌంటర్​.. 'నా సహచరుల్లో ఒకరిని కోల్పోయా'

Last Updated : Jul 3, 2023, 10:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.