ETV Bharat / sports

Ashes 2021-22: రెండో టెస్టుకు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన

author img

By

Published : Dec 15, 2021, 9:50 AM IST

Ashes 2021-22: యాషెస్ రెండో టెస్టు కోసం తుదిజట్టును ప్రకటించింది ఆస్ట్రేలియా. అడిలైడ్ వేదికగా గురువారం ఈ డేనైట్ టెస్టు ప్రారంభంకానుంది.

Australia playing XI for 2nd Test, Ashes 2nd Test, యాషెస్ రెండో టెస్టు, రెండో టెస్టుకు ఆస్ట్రేలియా జట్టుో
Ashes

Ashes 2021-22: యాషెస్ సిరీస్​లో భాగంగా ఇంగ్లాండ్​తో జరిగిన తొలి టెస్టులో ఘనవిజయం సాధించి జోరుమీదుంది ఆస్ట్రేలియా. అడిలైడ్ వేదికగా గురువారం ప్రారంభంకాబోయే డేనైట్ టెస్టులోనూ విజయం సాధించాలని చూస్తోంది. అందులో భాగంగానే ఇరుజట్లు ప్రాక్టీస్​లో మునిగితేలాయి. తాజాగా ఈ టెస్టు కోసం తుదిజట్టును ప్రకటించింది ఆసీస్.

స్టార్ పేసర్ హేజిల్​వుడ్ గాయం కారణంగా ఈ మ్యాచ్ నుంచి తప్పుకోగా.. ఇతడి స్థానంలో జే రిచర్డ్​సన్​ను తీసుకున్నారు. అలాగే పక్కటెముకల గాయంతో ఇబ్బందిపడిన వార్నర్​.. ఈ టెస్టుకు అందుబాటులో ఉంటాడని స్పష్టం చేశాడు కంగారూ జట్టు కెప్టెన్ కమిన్స్.

ఆస్ట్రేలియా జట్టు

మార్కస్ హారిస్, డేవిడ్ వార్నర్, లబుషేన్, స్మిత్, ట్రెవిస్ హెడ్, కామెరూన్ గ్రీన్, అలెక్స్ కారే, కమిన్స్ (కెప్టెన్), స్టార్క్, నాథల్ లియోన్, జే రిచర్డ్​సన్

ఇవీ చూడండి: రోహిత్ స్థానాన్ని భర్తీ చేసేదెవరు?.. రేసులో ముగ్గురు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.