ETV Bharat / sports

'రహానె ప్రదర్శనపై ఆందోళన వద్దు.. అతడే కీలకం'

author img

By

Published : Sep 6, 2021, 1:12 PM IST

Ajinkya Rahane
అజింక్యా రహానె

టీమ్​ఇండియా బ్యాట్స్​మన్​ అజింక్యా రహానె ప్రదర్శనపై (Rahane batting) విమర్శలు వస్తున్న నేపథ్యంలో బ్యాటింగ్​ కోచ్​ విక్రమ్​ రాఠోడ్ (vikram rathore batting coach)​ స్పందించాడు. రహానె మెరుగైన ప్రదర్శన చేయనప్పటికీ.. జట్టులో కీలకంగా వ్యవహిస్తాడని అతడికి మద్దతుగా నిలిచాడు.

ప్రస్తుతం జరుగుతోన్న భారత్-ఇంగ్లాండ్ టెస్టు​ సిరీస్​లో అజింక్యా రహానె(Ajinkya Rahane performance) పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. దీంతో అతనిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. సెప్టెంబర్​ 10 నుంచి జరగనున్న చివరి టెస్టులో రహానె(Rahane batting) ఆడతాడా? లేదా? అనే సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా బ్యాటింగ్​ కోచ్​ విక్రమ్​ రాఠోడ్ (vikram rathore batting coach).. రహానెకు మద్దతుగా నిలిచాడు. ప్రసుత్తం రహానె బ్యాటింగ్​లో రాణించలేకపోయినప్పటికీ.. జట్టులో కీలకంగా వ్యవహరిస్తాడని వ్యాఖ్యానించాడు.

"నేను ముందే చెప్పా. దీర్ఘకాలం క్రికెట్​ ఆడే సమయంలో కొన్ని దశలుంటాయి. కొన్ని సందర్భాల్లో జట్టులో ఆటగాళ్లు విఫలమవ్వొచ్చు. అటువంటి సమయాల్లో వారికి అండగా ఉండాలి. పుజారా విషయంలోనూ ఇదే జరిగింది. ఆ తర్వాత అతనికి ఎన్నో అవకాశాలు వచ్చాయి. దాంతో అతను పుంజుకుని.. ఎన్నో కీలక ఇన్నింగ్స్​ ఆడాడు. ఇప్పుడు రహానె కూడా ఫామ్​లోకి వస్తాడని నమ్మకం ఉంది. పేలవ ప్రదర్శన చేసినప్పటికీ.. జట్టులో కీలకంగా వ్యవహరిస్తున్నాడు. కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు."

- విక్రమ్​ రాఠోడ్​, టీమ్ఇండియా బ్యాటింగ్​ కోచ్

టీమ్​లో వైస్​ కెప్టెన్​గా వ్యవహరిస్తున్న రహానె చెత్త ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. ఇంగ్లాండ్​తో జరుగుతోన్న నాలుగో​ టెస్టు​ తొలి ఇన్నింగ్స్​లో 47 బంతుల్లో 14 పరుగులు మాత్రమే చేశాడు. రెండో ఇన్నింగ్స్​లో డకౌట్​గా వెనుదిరిగాడు. ఈ సిరీస్​లో రహానె ఇప్పటివరకు కేవలం 109 పరుగులే చేశాడు. దీంతో మెరుగైన ప్రదర్శన చేయని రహానెను ఎందుకు జట్టులోకి తీసుకుంటున్నారని క్రీడా విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో రహానెకు మద్దతుగా నిలిచాడు రాఠోడ్.

ఇదీ చూడండి: ఈ ఐదు మార్పులతో టెస్టు క్రికెట్​కు మరింత మజా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.