ETV Bharat / sports

ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించిన జట్లు ఇవే - శ్రీలంకకు ఇదే తొలిసారి!

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 13, 2023, 7:00 PM IST

2025 Champions Trophy Qualified Teams
2025 Champions Trophy Qualified Teams

2025 Champions Trophy Qualified Teams : పాకిస్థాన్ వేదికగా 9వ ఎడిషన్​ ఛాంపియన్స్​ ట్రోఫీ 2025లో జరగనుంది. ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు పాల్గొంటాయి. మరి ఈ టోర్నమెంట్​కు అర్హత సాధించిన జట్లేవో తెలుసుకుందాం

2025 Champions Trophy Qualified Teams : అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిర్వహించే టోర్నీల్లో ఛాంపియన్స్​ ట్రోఫీ కూడా ఒకటి. ఈ టోర్నీని కూడా వన్డే ప్రపంచకప్​లా ప్రతి నాలుగేళ్లకొకసారి జరుగుతుంది. ఈ టోర్నీలో 8 జట్లు తలపడుతాయి. ఈ క్రమంలో 2025 ఫిబ్రవరి - మార్చిలో తొమ్మిదో ఎడిషన్ టోర్నమెంట్ జరగనుంది. ప్రస్తుత ప్రపంచకప్​లో నాలుగు మ్యాచ్​ల్లో గెలిచిన పాకిస్థాన్.. రీసెంట్​గా 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించింది. మరి ఇప్పటికే ఈ టోర్నీకి అర్హత సాధించిన జట్లు ఏవో చూద్దాం.

భారత్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు 2025 ఛాంపియన్స్​ ట్రోఫీలో తలపడనున్నాయి. అయితే అఫ్గానిస్థాన్ తొలిసారి ఈ టోర్నీలో పాల్గొననుంది. ఇక శ్రీలంక మొదటిసారి ఈ టోర్నీకి అర్హత సాధించలేదు. ఈ ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విభజించి.. మ్యాచ్​లు నిర్వహిస్తారు. ఈ లీగ్​ మ్యాచ్​లో రెండు గ్రూపుల్లో టాప్ 2 జట్లు సెమీస్​కు అర్హత సాధిస్తాయి.

అయితే 1998లో తొలిసారి ప్రారంభమైన ఈ టోర్నీ అప్పట్లో ప్రతి రెండేళ్లకొకసారి జరిగింది. ఈ క్రమంలో 1998, 2002, 2004, 2006, 2009 నిర్వహించారు. తర్వాత టోర్నీ నిర్వహణ నాలుగేళ్లుగా ఐసీసీ నిర్ణయించింది. అప్పటినుంచి 2013, 2017లో టోర్నమెంట్ జరిగింది. అయితే ఆ తర్వాత 2021లో టోర్నీ జరగాల్సి ఉండగా.. పలు కారణాల వల్ల ఆ ఏడాది రద్దైంది. దీంతో 2025 నుంచి యథావిధిగా జరగనుంది. కాగా, ఈ ఎడిషన్​కు పాకిస్థాన్​ ఆతిథ్యమివ్వనుంది.

ఎవరెవరు ఎన్నిసార్లు విజేతలు.. భారత్ (2002, 2013), ఆస్ట్రేలియా (2006, 2009) అన్ని జట్ల కంటే అత్యధికంగా రెండుసార్లు నెగ్గాయి. అయితే భారత్ 2002లో శ్రీలంకతో పాటు సంయుక్తంగా ఛాంపియన్​గా నిలిచింది. ఇక సౌతాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక, వెస్టిండిస్, పాకిస్థాన్ ఒక్కోసారి గెలిచాయి.

చివరిసారి విజేత ఎవరు.. 2017లో చివరిసారిగా ఛాంపియన్స్ ట్రోఫీ జరిగింది. ఈ ఎడిషన్​లో ఫైనల్​లో భారత్.. పాకిస్థాన్​ను ఢీకొట్టింది. కానీ పాక్ నిర్దేశించిన 339 పరుగుల లక్ష్య ఛేదనలో టీమ్ఇండియా 158 పరుగుల వద్ద ఆలౌటై.. రన్నరప్​తో సరిపెట్టుకుంది.

ఎలా అర్హత సాధించాలి? ఆతిథ్యమిచ్చే జట్టు ఈ టోర్నీ ఆటోమెటిక్​గా అర్హత సాధిస్తుంది. ఇక ఈ టోర్నీకి ముందు జరిగే వన్డే వరల్డ్​కప్​లో టాప్ 7 జట్లు పాల్గొంటాయి.

'భారత్​ బ్యాటింగ్​ లైనప్​, అనేక తలలున్న రాక్షసుడు- ఓడిపోయినా తల ఎత్తుకునే వెళ్తున్నాం!'

' కెప్టెన్​గా ఎఫర్ట్​ పెడుతాను - వాళ్లు అలా చేయకపోతే ఏ జట్టుకైనా గెలవడం కష్టమే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.