T20 Worldcup: 12 ఏళ్ల చిన్నారి రూపొందించిన జెర్సీతో ఆ జట్టు!

author img

By

Published : Oct 19, 2021, 6:21 PM IST

Scotland jersey designer

12 ఏళ్ల వయసులో స్కూల్​కే పరిమితమవుతారు చాలామంది పిల్లలు. కానీ, ఓ చిన్నారి ఏకంగా తమ దేశ క్రికెట్ జట్టు జెర్సీనే రూపొందించింది. ఇంతకీ అది ఏ దేశం? ఆ చిన్నారి ఎవరు?.

ఐసీసీ టీ20 ప్రపంచకప్(T20 World Cup 2021)​ కోసం దాదాపు టోర్నీలో పాల్గొనే అన్ని దేశాలు తమ జట్ల కొత్త జెర్సీలను విడుదల చేశాయి. ఏ జట్టు పరిస్థితి ఎలా ఉన్నా.. స్కాట్లాండ్​(Scotland Jersey) దేశానికి చెందిన జెర్సీని మాత్రం 12 ఏళ్ల చిన్నారి రూపొందించిందంటే నమ్మశక్యంగా అనిపించదు. కానీ ఇది నిజం.

200 జెర్సీల్లో అదే..

స్కాట్లాండ్ దేశంలోని చిన్నారులు మొత్తంగా తమ జట్టు కోసం 200 జెర్సీలు(Scotland Jersey for T20 World Cup) రూపొందించారు. అందులో హడింగ్​టన్​కు చెందిన 12 ఏళ్ల చిన్నారి రెబెకా డౌనీ రూపొందించిన జెర్సీని సెలెక్ట్ చేశారు ఆ దేశ క్రికెటర్లు. స్కాట్లాండ్(Scotland Jersey Cricket 2021) దేశ చిహ్నం రంగులో ఈ జెర్సీని రూపొందించింది రెబెకా. ఈ నేపథ్యంలో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్​ను కుటుంబంతో సహా ప్రత్యక్షంగా వీక్షించింది రెబెకా.

"జెర్సీ రూపొందించే పోటీల్లో నేను గెలిచానని తెలియగానే చాలా ఆనందంగా అనిపించింది. ముందు ఈ విషయాన్ని నేను నమ్మలేకపోయా. మా దేశ ఆటగాళ్లు నేను రూపొందించిన జెర్సీని వేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. స్కాట్లాండ్​ జట్టును ప్రత్యక్షంగా కలిసే అద్భుత అవకాశం నాకు దక్కింది. జింబాబ్వేతో మ్యాచ్​ నేపథ్యంలో వారిని కలిశాను. వారు ఆడే ప్రతి మ్యాచ్​ గెలవాలని కోరుకుంటున్నా."

-రెబెకా డౌనీ, చిన్నారి.

రెబెకాను కలవడంపై స్కాట్లాండ్ కెప్టెన్ కైల్(Kyle coetzer) కూడా హర్షం వ్యక్తం చేశాడు . 'చిన్నారి రెబెకా ఈ జెర్సీ డిజైన్​ చేయడం జట్టు గర్వంగా భావిస్తోంది. వరల్డ్​కప్​లో మంచి ప్రదర్శన చేయాలని ఆశిస్తున్నాం. అభిమానులకు కూడా ఈ జెర్సీ నచ్చుతుందని అనుకుంటున్నా' అని కైల్ తెలిపాడు.

ఇదీ చదవండి:

'కోహ్లీ సారథ్యంలో అది జరిగితే మరీ మంచిది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.