ETV Bharat / sports

విదేశీ కోచ్​లు ముఖ్యమే కానీ..: కోచ్ పుల్లెల గోపీచంద్

author img

By

Published : May 28, 2021, 6:12 AM IST

Gopichand
పుల్లెల గోపీచంద్

మన దేశంలో విదేశీ కోచ్​ల ప్రాముఖ్యాన్ని నెమ్మదిగా తగ్గించుకుంటూ రావాలని బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల్ గోపీచంద్ అన్నారు. మాజీ ఆటగాళ్లను కోచ్​లుగా మార్చే కార్యక్రమం చేపట్టాలని సూచించారు.

మన దేశంలో క్రీడల ఎదుగుదలకు స్వదేశీ, విదేశీ కోచ్‌లు కలిసి పనిచేయడం ముఖ్యమని జాతీయ బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ అభిప్రాయపడ్డాడు. అయితే పూర్తిగా విదేశీ కోచ్‌ల మీదే ఆధారపడడం సరికాదని అన్నాడు. ద్వితీయ శ్రేణి విదేశీ కోచ్‌లు కేవలం ద్వితీయ శ్రేణి ఆటగాళ్లను మాత్రమే తయారుచేయగలరని తెలిపాడు. హై పర్‌ఫార్మెన్స్‌ కోచ్‌ ఎడ్యుకేషన్‌ వర్చువల్‌ కార్యక్రమం ఆరంభోత్సవంలో గోపీచంద్‌ మాట్లాడాడు.

"మన క్రీడాభివృద్ధికి విదేశీ కోచ్‌లు చాలా ముఖ్యం. క్రీడల్లో మనం ఏ అంశంలో అయితే నిపుణులం కాదో ఆ విషయంలో ఆరంభంలో విదేశీ కోచ్‌ల సాయం తీసుకోవడం కొన్నిసార్లు మంచిదే. కానీ విజయవంతమైన జట్లలో కూడా కేవలం విదేశీ కోచ్‌లనే కొనసాగిస్తే మన క్రీడా విధానానికి అన్యాయం చేసినట్లే. వాళ్ల నుంచి నేర్చుకున్న తర్వాత క్రమంగా వాళ్ల ప్రాధాన్యాన్ని తగ్గించాలి. ఎందుకంటే వాళ్లు ద్వితీయ శ్రేణి ఉత్తమ ఆటగాళ్లుగానే మనవాళ్లను తీర్చిదిద్దుతారు" గోపీచంద్ చెప్పాడు.

మాజీ ఆటగాళ్లను కోచ్‌లుగా మార్చే కార్యక్రమాన్ని చేపట్టాల్సిన అవసరం ఉందని ద్రోణాచార్య అవార్డు గ్రహీత గోపీచంద్ అభిప్రాయపడ్డాడు. "మనం అత్యుత్తమ విదేశీ కోచ్‌లను పొందే అవకాశం లేదు. ద్వితీయ శ్రేణి కోచ్‌లు మాత్రమే అందుబాటులో ఉంటారు. ఒప్పందాన్ని పొడిగించుకోవాలని కోరుకునే అలాంటి వాళ్ల కంటే భారత్‌ గెలవాలని తాపత్రయపడే స్వదేశీ కోచ్‌ల హృదయాలు ఎంతో గొప్పవి. అత్యుత్తమ ఆటగాళ్లను తయారుచేసేందుకు నిరంతరం శ్రమిస్తూనే ఉన్నాం. అలాగే ఆటగాళ్లను కోచ్‌లుగా మార్చే ప్రక్రియను మొదలెట్టాలి. క్రీడా సంఘాల, పాలకుల కింద పనిచేస్తూ, ఒత్తిడిని ఎదుర్కొనే కోచ్‌లకు గుర్తింపు లేకుండా పోతుంది. ఒక్కసారి ఓ అథ్లెట్‌కు మంచి పేరు వస్తే.. ఇక ఆ తర్వాత అతను చెప్పిందే వింటారు. ఈ పరిస్థితుల్లో మార్పు తెచ్చేందుకు కోచ్‌లకు మరింత బలాన్ని ఇవ్వాలి" అని ఇతడు చెప్పాడు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.