Pramod Bhagat: గోల్డ్​ గెలిచిన పారా అథ్లెట్​కు భారీ నజరానా

author img

By

Published : Sep 8, 2021, 4:55 PM IST

Pramod Bhagat

టోక్యో పారాలింపిక్స్​లో అదరగొట్టి.. బంగారు పతకం ముద్దాడిన షట్లర్ ప్రమోద్​ భగత్​కు భారీ నజరానా ప్రకటించింది ఒడిశా ప్రభుత్వం. అలాగే అతడికి గ్రూప్​ ఉద్యోగం కూడా ఇవ్వనున్నట్లు పేర్కొంది.

పారాలింపిక్స్​(paralympics india) బ్యాడ్మింటన్​లో స్వర్ణం సాధించిన ప్రమోద్​ భగత్​కు(pramod bhagat gold medal) రూ.6 కోట్ల నజరానా ప్రకటించింది ఒడిశా ప్రభుత్వం. దీనితో పాటే గ్రూప్​ ఏ ఉద్యోగం కూడా ఇవ్వనున్నట్లు బుధవారం ప్రకటించింది.

ఇటీవల జరిగిన ఫైనల్​లో గ్రేట్​ బ్రిటన్​ ప్లేయర్ డేనియల్ బెతెల్​ను ఓడించిన ప్రమోద్.. ఈ విభాగంలో మన దేశం తరఫున తొలి గోల్డ్ గెలిచిన క్రీడాకారుడిగా రికార్డు సృష్టించాడు.

నాలుగేళ్ల వయసులోనే పోలియో ప్రభావంతో దివ్యాంగుడు అయిన ప్రమోద్.. పక్కింటి వాళ్లు ఆడుతుంటే చూసి క్రీడల వైపు వచ్చాడు. 2006లో తొలిసారి పారా బ్యాడ్మింటన్​ పోటీల్లో పాల్గొన్న ఇతడు.. తన ఖాతాలో దాదాపు 45 అంతర్జాతీయ పతకాలు జమ చేశాడు. ఇందులో ప్రపంచ ఛాంపియన్​షిప్​లో నాలుగు స్వర్ణాలు, 2018 ఆసియా గేమ్స్(asian games 2018) గోల్డ్​ కూడా ఉంది.

గత కొన్నేళ్లు కోచ్​గా పనిచేసిన ప్రమోద్.. 2019లోదానికి విరామమిచ్చి, పారాలింపిక్స్​ క్వాలిఫికేషన్​పై దృష్టిపెట్టాడు. ఆ తర్వాత అర్హత సాధించి, ఏకంగా గోల్డ్​ చేజిక్కుంచుకున్నాడు. క్రీడల్లో ప్రతిభ చూపినందుకుగానూ 2019లో ఇతడిని అర్జున(arjuna award), బిజు పట్నాయక్ అవార్డులు కూడా వరించాయి.

Pramod Bhagat
అర్జున అవార్డుతో ప్రమోద్ భగత్

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.