ETV Bharat / sports

Tokyo Paralympics: పారాలింపిక్స్​లో పతకం నెగ్గిన తొలి ఐఏఎస్

author img

By

Published : Sep 5, 2021, 7:47 AM IST

Updated : Sep 5, 2021, 9:34 AM IST

suhas
సుహాస్

07:23 September 05

Tokyo Paralympics: భారత్​కు మరో పతకం- యతిరాజ్​కు రజతం​

టోక్యో పారాలింపిక్స్​లో(Tokyo Paralympics) భారత్​కు మరో పతకం లభించింది. బ్యాడ్మింటన్ ఎస్​ఎస్4లో సుహాస్ లాలినకెరె యతిరాజ్(Suhas Yathiraj Paralympics)​ రజతం సాధించారు. ఆదివారం జరిగిన ఫైనల్లో 1-2 తేడాతో ఫ్రాన్స్​ షట్లర్ మజుర్ లుకాస్ చేతిలో ఓటమి పాలై.. రజతంతో సరిపెట్టుకున్నారు.  

నోయిడా జిల్లా కలెక్టర్ సుహాస్​ యతిరాజ్(38).. భారత్​ తరఫున పారాలింపిక్స్​లో పాల్గొన్న సివిల్​ సర్వెంట్​గా నిలిచారు. తొలి పతకం పట్టిన ఐఏఎస్​ కూడా ఆయనే. 

ఎస్​ఎల్​ 4 కాంస్య పతక పోటీలో తరుణ్ ధిల్లాన్(Tarun Dhillon Paralympics) ఓటమి పాలయ్యాడు. ఇండోనేసియా ఆటగాడు ఫ్రెడీ సతియావన్​ చేతిలో ఓడిపోయాడు.  ​  

యతిరాజ్​పై ప్రశంసలు..

రజతం గెలిచిన ఐఏఎస్​ అధికారి యతిరాజ్​ను రాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు ప్రశంసించారు.

"ప్రపంచ నంబర్​.1 ఆటగాడికి గట్టి పోటీ ఇచ్చి రజత పతకం సాధించిన యతిరాజ్​కు అభినందనలు. కలెక్టర్​గా విధులు నిర్వహిస్తూనే స్పోర్ట్స్​పై దృష్టి పెట్టడం గర్వించదగ్గ విషయం. భవిష్యత్తులో మరింతగా రాణించాలి."

--రామ్​నాథ్​ కోవింద్, రాష్ట్రపతి.  

"స్పోర్ట్స్​లో ఈ ఘనత సాధించిన యతిరాజ్​కు శుభాకాంక్షలు. సర్వీస్​లో ఉంటూ పారాలింపిక్స్​లో రజతం సాధించి జాతీయ దృష్టిని ఆకర్షించాడు యతిరాజ్. భవిష్యత్తులో యతిరాజ్ మరింతగా రాణించాలని ఆశిస్తున్నా."

-- నరేంద్ర మోదీ, ప్రధాని.

పారాలింపిక్స్​ పతక విజేతకు అభినందనలు తెలిపారు ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. గతంలో కూడా యతిరాజ్​ ఎన్నో పతకాలు గెలిచారని అన్నారు. అధికారిగా విధులు నిర్వహిస్తూనే పారాలింపిక్స్​లో పతకం నెగ్గడం హర్షనీయమని అన్నారు.  

ఆరేళ్ల శ్రమ..

యతిరాజ్​ ఫైనల్​లో బాగా ఆడాడని ఆయన సతీమణి రితూ సుహాస్(Suhas Lalinakere Yathiraj Wife)​ చెప్పారు. పతకం గెలవడం ఆయన ఆరేళ్ల శ్రమకు ప్రతిఫలమని అన్నారు. ప్రస్తుతం ఆమె గాజియాబాద్ ఏడీఎంగా విధులు నిర్వహిస్తున్నారు.  

ఈ పతకంతో.. టోక్యో పారా ఒలింపిక్స్​లో భారత్ పతకాల సంఖ్య 18కు చేరింది.

Last Updated :Sep 5, 2021, 9:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.