Paralympics 2021: మనోళ్లు పతకాల ప్రభంజనం.. చరిత్రలోనే తొలిసారి

author img

By

Published : Sep 5, 2021, 12:46 PM IST

tokyo paralympics

టోక్యో పారాలింపిక్స్​లో(tokyo paralympics india medals) భారత అథ్లెట్లు అదరగొట్టారు. దేశచరిత్రలోనే పారాలింపిక్స్​లో ఎప్పుడూ సాధించలేనన్ని పతకాలను అందుకున్నారు. మొత్తంగా 19మెడల్స్​ను సాధించారు. అందులో ఐదు స్వర్ణాలు ఉండటం విశేషం. ఇంతకీ ఎవరెవరికీ ఏఏ విభాగాల్లో పతకాలను ముద్దాడారంటే?

గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి టోక్యోలో జరిగిన పారాలింపిక్స్​లో(tokyo paralympics india medals) భారత్ అదరగొట్టేసింది.​ చరిత్రలో లేనంత అత్యుత్తమ ప్రదర్శనతో తమ ప్రయాణాన్ని ముగించింది. ఉత్కంఠంగా సాగిన ఈ పోటీల్లో మన అథ్లెట్లు అద్భుత ప్రదర్శన కనబరిచి దేశప్రజల మనసులు గెలుచుకున్నారు. పారాలింపిక్స్​లో ఎక్కువ పతకాలు(19) సాధించి దేశ గౌరవాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు. ఇందులో 5 స్వర్ణాలు, 8 రజతాలు, 6 కాంస్యాలు ఉన్నాయి. గత 60 ఏళ్ల చరిత్రలోనే ఓ పారాలింపిక్స్​లో మన బృందం ఇన్ని పతకాలు దక్కించుకోవడం ఇదే తొలిసారి.

ఏఏ విభాగాల్లో ఎన్ని వచ్చాయంటే?

గరిష్ఠంగా అథ్లెటిక్స్​లో ఎనిమిది మెడల్స్​ వచ్చాయి. షూటింగ్, ​బ్యాడ్మింటన్, ఆర్చరీ, టేబుల్ టెన్నిస్ విభాగాల్లో మిగతా పతకాలు దక్కాయి.

అథ్లెటిక్స్​ -8

షూటింగ్​ -5

బ్యాడ్మింటన్​-4

ఆర్చరీ-1

టేబుల్​ టెన్నిస్​ -1

స్వర్ణాలు

సుమిత్​ (పురుషుల జావెలిన్​ త్రో, ఎఫ్​ 64 విభాగం)

కృష్ణ నాగర్​ (బ్యాడ్మింటన్​, ఎస్​హెచ్​ 6)

ప్రమోద్​ భగత్​(బ్యాడ్మింటన్​, ఎస్​ఎల్​ 3)

మనీశ్ నర్వాల్(షూటింగ్​, పీ4 మిక్స్​డ్​ 50మీటర్లు పిస్టోల్​ ఎస్​హెచ్​ 1)​

అవని లేఖరా (షూటింగ్​, మహిళల 10మీటర్ల ఎయిర్​ రైఫిల్​ స్టాండింగ్​ ఎస్​హెచ్​ 1)

రజతం

యోగేశ్​ కతునియా(పురుషుల డిస్కస్​ త్రో, ఎఫ్​ 56 విభాగం )

నిషాద్​ కుమార్​ (పురుషుల హై జంప్,​ టీ 47)

మరియప్పన్​ తంగవేలు(పురుషుల​ హై జంప్,​ టీ63)

ప్రవీణ్ కుమార్​ (పురుషుల​ హై జంప్​, టీ 64)

దేవేంద్ర జజరియా(పురుషుల జావెలిన్​ త్రో, ఎఫ్​​ 46)

యతిరాజ్​ సుహాస్​ (బ్యాడ్మింటన్​ పురుషుల​ సింగిల్స్​ ఎస్​ ఎల్​ 4)

సింగ్​రాజ్​ (పీ 4 మిక్స్​డ్​ 50మీటర్ల పిస్టోల్​ ఎస్​హెచ్​ 1)

భవీనాబెన్​ పటేల్​ (టేబుల్​ టెన్నిస్,​ క్లాస్​ 4)

కాంస్యం

హర్విందర్​ సింగ్​ (ఆర్చరీ )

శరద్ కుమార్​​ (పురుషుల​ హై జంప్​, టీ 63)

సుందర్​ సింగ్ గుర్జార్​​ (పురుషుల​ జావెలిన్​ త్రో, ఎఫ్​ 46)

మనోజ్ సర్కార్​​ (బ్యాడ్మింటన్​ పురుషుల ​సింగిల్స్,​ ఎస్​ ఎల్​ 3)

సింగ్​రాజ్​ (పీ1 పురుషుల​ 10మీటర్ల ఎయిర్​ పిస్టోల్​ ఎస్​హెచ్​ 1)

అవని లేఖరా (ఆర్​ 8 మహిళల 50మీటర్ల రైఫిల్​ 3 పొజిషన్స్​ ఎస్​హెచ్​ 1)

ఇదీ చూడండి: Tokyo Paralympics: భారత్​కు మరో పతకం.. బ్యాడ్మింటన్​లో కృష్ణకు స్వర్ణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.