ETV Bharat / sports

డిసెంబరులో ఇండియా ఓపెన్​ బ్యాడ్మింటన్​ టోర్నీ​

author img

By

Published : May 22, 2020, 6:57 PM IST

Indian Open Olympic-qualifying tournament to be held in December 2020
డిసెంబరులో ఇండియా ఓపెన్​ బ్యాడ్మింటన్​ టోర్నీ​

కరోనా కారణంగా వాయిదా పడిన బ్యాడ్మింటన్​ టోర్నమెంట్ల నిర్వహణకు కొత్త షెడ్యూళ్లను ప్రకటించింది ప్రపంచ బ్యాడ్మింటన్​ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్​). మార్చిలో వాయిదా పడిన ఇండియా ఓపెన్​ బ్యాడ్మింటన్​ టోర్నమెంట్​ను డిసెంబరు 8 నుంచి 13 వరకు నిర్వహించనున్నట్లు ప్రకటనలో తెలిపింది.

కరోనా కారణంగా ఒలింపిక్​ అర్హత పోటీ అయిన ఇండియా ఓపెన్​ బ్యాడ్మింటన్​ టోర్నమెంట్​ వాయిదా పడింది. ప్రస్తుతం ఆ టోర్నీ నిర్వహణకు తాజాగా ప్రణాళిక రూపొందింది. డిసెంబరు 8 నుంచి 13 వరకు టోర్నీ జరుగుతుందని ప్రపంచ బ్యాడ్మింటన్​ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్​) తాజాగా ప్రకటించింది.

ఇండియా ఓపెన్​ బ్యాడ్మింటన్​ టోర్నమెంట్​ దిల్లీ వేదికగా మార్చి 24-29 వరకు జరగాల్సింది. కానీ, కరోనా మహమ్మారి కారణంగా గతంలో దీన్ని నిరవధిక వాయిదా వేశారు. ప్రపంచవ్యాప్తంగా బ్యాడ్మింటన్​ టోర్నీల నిర్వహణకు కొత్త క్యాలండర్​ను బీడబ్ల్యూఎఫ్​ విడుదల చేసింది. దీని కంటే ముందుగా హైదరాబాద్​ ఓపెన్​ (ఆగస్టు 11-16), సయీద్​ మోదీ అంతర్జాతీయ టోర్నమెంట్​ (నవంబరు 17-22) జరగనున్నాయి.

మరో ఎనిమిది టోర్నమెంట్ల నిర్వహణ తేదీలను రీషెడ్యూల్​ చేసింది ప్రపంచ బ్యాడ్మింటన్​ సమాఖ్య(బీడబ్ల్యూఎఫ్​). అందులో న్యూజిలాండ్ ఓపెన్ సూపర్-300, ఇండోనేషియా ఓపెన్ సూపర్-1000, మలేసియా ఓపెన్ సూపర్-750, థాయిలాండ్ ఓపెన్ సూపర్-500, చైనాలో వరల్డ్ టూర్ ఫైనల్స్ తేదీలనూ ప్రకటించింది.

"బ్యాడ్మింటన్​ టోర్నీల నిర్వహణకు తిరిగి ప్రణాళికలను తయారు చేయడం చాలా కష్టమైన పని. ఈ ప్రణాళికకు కట్టుబడి ఉంటాం. ఎందుకంటే అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు మా ప్రయాణాన్ని మొదలు పెడతామని ఆశిస్తున్నాం. అలాగే, ప్రస్తుత సమయంలో అంతర్జాతీయ ప్రయాణాలు ఎప్పడు మొదలవుతాయో ఊహించడం కష్టం. టోర్నీలకు షెడ్యూల్​ వేసిన సమయం సురక్షితం కాదు అని స్పష్టంగా తెలిస్తే పోటీలను నిర్వహించం".

-థామస్ లండ్​, బీడబ్ల్యూఎఫ్​ సెక్రటరీ జనరల్​

ఇదీ చూడండి.. నిప్పు.. నీరు కలిస్తే ఓ ట్రెండ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.