ETV Bharat / sports

ఆల్​ ఇంగ్లాండ్ ఓపెన్: భారత షట్లర్లు సత్తా చాటేనా?

author img

By

Published : Mar 17, 2021, 5:45 AM IST

బర్మింగ్​హామ్​ వేదికగా ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ ప్రారంభం కానుంది. టోక్యో ఒలింపిక్స్​కు ముందు జరుగుతున్న ఈ టోర్నీలో సత్తా చాటాలని భారత షట్లర్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ తొలి మ్యాచ్​లో ఇండియా ఆటగాళ్లు ఎవరెవరితో తలపడనున్నారో ఓ సారి చూద్దాం.

All England Open: Sindhu and Co. aim to improve performance
ఆల్​ ఇంగ్లాండ్ ఓపెన్: భారత షట్లర్లు సత్తా చాటేనా?

యూకే బర్మింగ్​హామ్​ వేదికగా ఆల్​ ఇంగ్లాండ్​ ఓపెన్​ బ్యాడ్మింటన్​ ఛాంపియన్​షిప్స్​ టోర్నీ ప్రారంభం కానుంది. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్​ పాల్గొననున్నారు. గతంలో ఆల్​ ఇంగ్లాండ్​ ఓపెన్​ను కేవలం ఇద్దరు భారతీయులు మాత్రమే గెలుపొందారు. వారిలో ఒకరు ప్రకాశ్​ పదుకొణె(1980) కాగా, మరొకరు పుల్లెల గోపీచంద్​ (2001).

ఇటీవల స్విస్​ ఓపెన్​లో ఫైనల్​ చేరిన పీవీ సింధు.. మారిన్ చేతిలో పరాజయం పాలైంది. 2018లో ఆల్​ ఇంగ్లాండ్​ టోర్న సెమీ ఫైనల్​లో ఇంటిముఖం పట్టిన ఈ ఐదో సీడ్ ప్లేయర్.. ఈ సారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తోంది. ఒలింపిక్ రజత పతక విజేత అయిన సింధు.. టోర్నీ ఫెవరేట్లలో ఒకరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. సింధు తన తొలి గేమ్​లో మలేషియా క్రీడాకారిణి సోనియా చెయ్​తో తలపడనుంది.

మరో సింగిల్స్​ షట్లర్​ సైనా నెహ్వాల్​.. రెండేళ్లుగా ఫామ్​లేమితో తంటాలు పడుతోంది. ఈ సారైనా ఆల్​ ఇంగ్లాండ్​ ఓపెన్​లో సత్తా చాటాలని భావిస్తోంది. 2015లో ఈ టోర్నీలో రన్నరప్​తో సరిపెట్టుకున్న సైనా.. తన తొలి మ్యాచ్​లో మియా బ్లిచ్‌ఫెల్డ్​తో పోటీకి దిగనుంది.

మూడు సార్లు ప్రపంచ ఛాంపియన్​, నంబర్​ వన్​ షట్లర్​ కరోలినా మారిన్​ గాయం కారణంగా ఈ టోర్నీలో ఆడట్లేదు. టోక్యో ఒలింపిక్స్​కు ఇది ఓపెన్ అర్హత టోర్నీ కాకపోవడం వల్ల ఇందులో చైనీస్​, కొరియన్​, తైవాన్ షట్లర్లు కూడా పాల్గొనడం లేదు.

పురుషుల సింగిల్స్​లో మాజీ నంబర్​ వన్​ ఆటగాడు కిదాంబి శ్రీకాంత్​.. స్విస్​ ఓపెన్​లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేశాడు. కిదాంబి తన ప్రారంభ రౌండ్​లో ఇండోనేషియా ఆటగాడు టోమీ సుగియార్టోతో తలపడనున్నాడు. ​

మరో సింగిల్స్​ ఆటగాడు, కామన్​వెల్త్​ గేమ్స్​ స్వర్ణ విజేత పారుపల్లి కశ్యప్ తన తొలి గేమ్​లో జపాన్​కు చెందిన కెంటో మొమొటతో ఆడనున్నాడు. యువ షట్లర్​ లక్ష్యసేన్​, థాయ్​ ప్లేయర్​ కాంటాఫోన్ వాంగ్‌చరోయిన్​తో తొలి గేమ్​ ఆడనున్నాడు.

డబుల్స్​లో సాత్విక్​ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీ.. ప్రస్తుతం పదో ర్యాంక్​లో ఉన్నారు. స్విస్​ ఓపెన్​లోనూ ఈ జంట ఆకట్టుకుంది. ఫ్రాన్స్‌కు చెందిన ఎలోయి ఆడమ్, జూలియన్ మైయోతో ఈ జోడీ మొదటి గేమ్​లో ఆడనుంది.

హెచ్​ఎస్​ ప్రణయ్, మలేషియా షట్లర్​ డారెన్​తో తలపడనున్నాడు. బ్రెజిల్​కు చెందిన వైగోర్ కోయెల్హోతో సమీర్ వర్మ తన మొదటి మ్యాచ్​ను ఆడనున్నాడు. ఫ్రాన్స్​ సింగిల్స్​ షట్లర్​ టోమా జూనియర్​ పోపోవ్​తో భారత ప్లేయర్ సాయి ప్రణీత్ తొలి మ్యాచ్​లో పోటీ పడనున్నాడు.

మహిళల డబుల్స్​లో అశ్విని పొన్నప్ప- సిక్కి రెడ్డి జంటతో థాయ్​లాండ్ బెన్యాపా ఐమ్‌సార్డ్-నుంటకార్న్ ఎయిమ్‌సార్డ్ జోడీ తలపడనుంది. మిక్స్​డ్ డబుల్స్​లో సాత్విక్​రాజ్​ రాంకీ రెడ్డి-అశ్విని పొన్నప్ప జోడీ జపాన్​కు చెందిన యుకీ కనెకో, మిసాకి మాట్సుటోమోతో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.

ఇదీ చదవండి: కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్​.. ఇంగ్లాండ్ లక్ష్యం 157

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.