ETV Bharat / sitara

Bigg Boss 5: బిగ్​బాస్​లో ఈ సారి కొత్త హోస్ట్!

author img

By

Published : Jun 29, 2021, 5:32 PM IST

New host for Bigg Boss Telugu Season 5?
Bigg Boss 5: బిగ్​బాస్​లో ఈ సారి కొత్త హోస్ట్!

బుల్లితెర రియాలిటీ షో బిగ్​బాగ్ ఐదో సీజన్(Bigg Boss Telugu Season 5)​ వ్యాఖ్యాతగా టాలీవుడ్​లోని ఓ విలక్షణ నటుడ్ని ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అనేక సినిమాల్లో విభిన్న పాత్రలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన నటుడు రానా దగ్గుబాటి(Rana Daggubati).. రాబోయే బిగ్​బాస్​ సీజన్​లో హోస్ట్​గా వ్యవహరించనున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది.

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించిన రియాలిటీ షో బిగ్​బాస్​ కార్యక్రమానికి సంబంధించిన మరో కొత్త సీజన్​ త్వరలోనే ప్రారంభం కానుంది. తెలుగులో ఇప్పటికే నాలుగు సీజన్స్​ పూర్తి చేసుకొని ఐదోసారి(Bigg Boss Telugu Season 5) ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. కరోనా కారణంగా జులైలోనే ప్రారంభం కావాల్సిన ఈ రియాలిటీ షో.. సెప్టెంబరుకు వాయిదా పడినట్లు సినీవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ గ్యాప్​లో పోటీదారులను ఎంపిక చేసే పనిలో పడిందట బిగ్​బాస్​ బృందం.

New host for Bigg Boss Telugu Season 5?
రానా దగ్గుబాటి

తొలి సీజన్​కు యంగ్​ టైగర్​ ఎన్టీఆర్​ వ్యాఖ్యాతగా వ్యవహరించగా.. రెండో సీజన్​ కోసం హీరో నాని.. ఆ తర్వాత మూడు, నాలుగు సీజన్లలో 'కింగ్​' నాగార్జున హోస్ట్​గా(Bigg Boss Telugu Host) పనిచేశారు. అయితే ఈ సారి మరో హీరోను హోస్ట్​గా ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే 'నంబరు.1​ యారి' కార్యక్రమంలో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరో రానా దగ్గుబాటిని(Rana As Bigg Boss Host) ప్రస్తుత సీజన్​కు హోస్ట్​గా ఎంపిక చేశారని సోషల్​మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

ఇదీ చూడండి.. బిగ్​బాస్​ సెట్​ సీజ్​ చేసిన పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.