ETV Bharat / sitara

ఆమనిని పక్కకు పిలిచి వార్నింగ్ ఇచ్చిన స్టార్ హీరో!

author img

By

Published : Aug 31, 2021, 9:21 AM IST

Updated : Aug 31, 2021, 10:10 AM IST

హీరోయిన్​గా ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న ఆమని, ఇంద్రజ(aamani, indraja).. ప్రస్తుతం బుల్లితెరతో పాటు చిత్రాల్లో అలరిస్తున్నారు. ఈ వారం 'ఆలీతో సరదాగా'కు(ali tho saradaga) విచ్చేసిన వీరిద్దరూ.. నాటి సంగతులను వెల్లడించారు.

Ali tho saradaga latest episode
ఆమని

ప్రముఖ దర్శకుడు కె. విశ్వనాథ్, హీరోగా కమల్​హాసన్(kamal haasan), నిర్మాతగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం(sp balasubrahmanyam) రూపొందించిన 'శుభసంకల్పం' సినిమా కోసం పనిచేయడం మర్చిపోలేని అనుభూతి అని నటి ఆమని చెప్పింది. 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి నటి ఇంద్రజతో కలిసి హాజరైన ఈమె పలు ఆసక్తికర విషయాల్ని పంచుకుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఈ చిత్రంలో అవకాశం రావడం తనకు దక్కిన అదృష్టమని ఆమని చెప్పింది. చుట్టూ సీనియర్స్ ఉండేసరికి భయపడిపోయానని తెలిపింది. దీనివల్ల వచ్చిన భయంతోనే ఓ సీన్​లో నిజంగానే కమల్​హాసన్​ కొట్టేసినట్లు పేర్కొంది. అప్పుడు కమల్​ పక్కకు పిలిచి.. 'కొట్టడం అంటే నిజంగా కొట్టడం కాదమ్మా.. కొట్టినట్లు నటించాలి' అని తనతో చెప్పారని ఆమని వెల్లడించింది.

ఈ సినిమా కోసం మేకప్​ వేస్తే, దానిని తొలగించేయమని కెమెరామ్యాన్ పీసీ శ్రీరామ్​ తమ అందరితో చెప్పినట్లు ఆమని చెప్పింది. మేకప్​ లేకపోతే డీగ్లామర్​ కనిపిస్తానేమో అని తాను భయపడినట్లు తెలిపింది. కానీ సినిమా చాలా బాగా వచ్చిందని పేర్కొంది.

aamani indraja
ఆమని ఇంద్రజ

తను హీరోయిన్​గా మలయాళంలో చేస్తున్న సమయంలో ఓ సినిమా నిర్మాతలు తనతో అగ్రిమెంట్​ కుదుర్చుకున్నారని ఇంద్రజ చెప్పింది. అయితే వేరే చిత్రాలు చేస్తున్న సమయంలో తమతో సినిమా చేయాలంటూ తనపై ఒత్తిడి తీసుకొచ్చారని తెలిపింది. ఆ సమయంలో హీరో మమ్ముట్టి(mammootty) కల్పించుకుని, సదరు నిర్మాతలతో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించారని ఇంద్రజ(indraja) తెలిపారు. కానీ మీడియా ప్రతినిధులు దీనిని కోర్టు, కేసు అంటూ రాసేశారని స్పష్టం చేసింది.

ఇది చదవండి: South indian actors: ఓటీటీల వైపు స్టార్ హీరోలు..

Last Updated : Aug 31, 2021, 10:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.