ETV Bharat / sitara

Rakul Preet Singh: 'నాకు బాయ్​ఫ్రెండ్స్​ ఎక్కువే'

author img

By

Published : Jun 30, 2021, 4:59 PM IST

Updated : Jun 30, 2021, 5:24 PM IST

Actress Rakul Preet Singh interview in Alitho Saradaga
Rakul Preet Singh: నాకు బాయ్​ఫ్రెండ్స్​ ఎక్కువే!

రకుల్​ప్రీత్​ సింగ్​కు​ చాలామంది బాయ్​ఫ్రెండ్స్ ఉన్నారట. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా వెల్లడించింది. అలానే ప్రతిరోజూ ఏదో ఓ అడ్వెంచర్​ చేస్తుంటానని చెప్పింది. దీనితోపాటు చాలా విషయాల్ని పంచుకుంది.

'కెరటం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రకుల్ ప్రీత్ సింగ్.. 'వెంకటాద్రి ఎక్స్​ప్రెస్​'తో హీరోయిన్​గా గుర్తింపు తెచ్చుకుంది. అనంతరం అగ్రహీరోల సరసన అవకాశాలు దక్కించుకుంది. అయితే తాను పాకెట్​ మనీ కోసమే సినిమాల్లోకి వచ్చానని, ఆ తర్వాత ఇండస్ట్రీపై అమితమైన ఇష్టంతో ముందుకు సాగానని స్వయంగా వెల్లడించింది. 'ఆలీతో సరదాగా'(Rakul Preet Singh Alitho Saradaga) షోకు గతంలో హాజరైనప్పుడు దీనితో పాటే పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించింది.

తోటి హీరోయిన్లు రెజీనా, రాశీ ఖన్నాల్లో ఎవరంటే ఎక్కువ ఇష్టమని వ్యాఖ్యాత అలీ అడగ్గా.. అందరిని ఇష్టపడతానని, ముఖ్యంగా తెలుగు చిత్రసీమ అంతా తన గుండెల్లో ఉందని చెప్పింది. ఎందుకంటే టాలీవుడ్​ లేనిదే తాను లేనని బాహాటంగా చెప్పేసింది.

'బాహుబలి'లో చిన్నపాత్రైనా..

చిత్రపరిశ్రమలో అడుగుపెట్టిన తొలినాళ్లతో చేజారిపోయిన అవకాశాల గురించి మనసులో మాట బయటపెట్టింది. అలాంటి ఎదురుదెబ్బలే తనను విజయపథంలో నడిపించాయని చెప్పింది. ఒకవేళ 'బాహుబలి'లో చిన్నపాత్ర ఇచ్చినా సరే చేసి ఉండేదాన్ని తెలిపింది.

బాయ్​ ఫ్రెండ్స్​ ఎక్కువే..

తన తండ్రి ఉద్యోగరీత్యా భారతదేశం మొత్తం ఎక్కువగా ట్రావెల్​ చేశానని రకుల్​ తెలిపింది. అందుకే తనకు స్నేహితులు ఎక్కువగా ఉన్నారని చెప్పింది. అందులో బాయ్​ఫ్రెండ్స్​ ఎక్కువగా ఉన్నారని పేర్కొంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి.. మరో హిందీ చిత్రంలో రకుల్​.. బిజీగా కీర్తి

Last Updated :Jun 30, 2021, 5:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.