ETV Bharat / sitara

రెహమాన్​ దర్శకత్వంలో విజయ్​ నయా రోల్​

author img

By

Published : Jul 9, 2019, 1:22 PM IST

రెహమాన్​ దర్శకత్వంలో సింగర్​గా విజయ్​ దళపతి

తమిళ నటుడు విజయ్​, దర్శకుడు అట్లీ కాంబినేషన్​లో వస్తోన్న చిత్రం 'బిగిల్​'. ఈ సినిమాలో హీరోగానే కాకుండా గాయకుడిగానూ అలరించనున్నాడు ఇళయదళపతి​. సంగీత మాంత్రికుడు రెహమాన్​ సారథ్యంలో ఈ పాట రూపొందుతోంది.

కోలీవుడ్​ దర్శకుడు అట్లీ, హీరో విజయ్‌ది సూపర్​హిట్​ కాంబినేషన్‌. 'తేరి', 'మెర్సల్‌' చిత్రాల తర్వాత వీరిద్దరూ కలిసి చేస్తోన్న సినిమా 'బిగిల్‌'. దీనికి విజిల్‌, ఈల అని అర్ధం. ఈ సినిమాలో నటుడిగానే కాకుండా గాయకుడిగానూ ఆకట్టుకోనున్నాడు దళపతి​. స్వరమాంత్రికుడు రెహమాన్​ సారథ్యంలో విజయ్​ గాత్రంతో 'వెర్రితనం' పేరుతో పాట రూపొందిస్తున్నారు. పాటల రచయిత వివేక్​ లిరిక్స్​ రాశాడు.

vijay thalapathay singer in rehman's bigil
సింగర్​గా విజయ్​ దళపతి

గతంలో హ్యారిస్​ జయరాజ్​తో కలిసి 'తుపాకీ' చిత్రంలో, జీవీ ప్రకాశ్​తో 'తేరి' సినిమాలో పాట పాడాడు విజయ్​. సర్కార్​ మూవీలో పాట పాడించేందుకు రెహమాన్ ప్రయత్నించినా కుదరలేదు. 'బిగిల్'​లో తొలిసారి వీరిద్దరి కాంబోలో పాట రాబోతోంది.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్​లుక్​ ఆకట్టుకుంది. ఇందులో ద్విపాత్రాభియనంతో మెప్పించనున్నాడు విజయ్​. ఫుట్‌బాల్‌ కోచ్‌గా, గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నాడు. నయనతార కథానాయిక. దాదాపు రూ.125 కోట్ల భారీ బడ్జెట్‌తో ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ సినిమాను నిర్మిస్తోంది. ఈ ఏడాది దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవీ చూడండి...

ఆర్మీ అధికారిగా మహేశ్... ఫస్ట్​​ లుక్​ లీక్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.