ETV Bharat / sitara

గిరీశయ్య దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ చిత్రం

author img

By

Published : Apr 2, 2021, 10:42 AM IST

Vaishnav Tej new movie launched
గిరీశయ్య దర్శకత్వం వైష్ణవ్ చిత్రం.. పూజ పూర్తి

'ఉప్పెన' ఫేమ్ వైష్ణవ్ తేజ్ హీరోగా మరో చిత్రానికి రంగం సిద్ధమైంది. 'అర్జున్ రెడ్డి' తమిళ రీమేక్​కు దర్శకత్వం వహించిన గిరీశయ్య డైరెక్షన్​లో ఇతడు ఓ సినిమా చేయనున్నాడు. ఈ మూవీ పూజా కార్యక్రమం ఈరోజు జరిగింది.

తొలి చిత్రంతోనే బాక్సాఫీస్ దగ్గర బ్లాక్​బస్టర్ విజయం అందుకున్నాడు మెగా హీరో వైష్ణవ్ తేజ్. 'ఉప్పెన' చిత్రంలో ఇతడి నటనకు విమర్శకుల ప్రశంసలూ దక్కాయి. ఆ సినిమా విడుదలకాకముందే క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమాకు ఓకే చెప్పేశాడు. తాజాగా తన మూడో చిత్రానికి సిద్ధమయ్యాడు. ఈ మూవీ పూజా కార్యక్రమం ఈరోజు పూర్తయింది.

Vaishnav Tej new movie launched
క్లాప్​నిస్తున్న సాయి తేజ్
Vaishnav Tej new movie launched
కెమార్ స్విచ్ఛాన్ చేస్తోన్న వైష్ణవ్ తల్లి విజయ దుర్గ

ఈ చిత్రానికి 'అర్జున్ రెడ్డి' తమిళ రీమేక్​కు దర్శకత్వం వహించిన గిరీశయ్య డైరెక్టర్​గా వ్యవహరించనున్నాడు. కేతికాశర్మ హీరోయిన్. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానుంది.​

Vaishnav Tej new movie launched
కేతికా శర్మ, వైష్ణవ్ తేజ్
Vaishnav Tej new movie launched
వైష్ణవ్ తేజ్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.