ETV Bharat / sitara

అభిమానులూ సిద్ధం కండి.. పవర్​స్టార్​ నుంచి భారీ అప్​డేట్స్​!

author img

By

Published : Aug 13, 2021, 1:45 PM IST

Updated : Aug 13, 2021, 2:16 PM IST

పవర్​స్టార్ పవన్​ కల్యాణ్​ అభిమానులకు పవర్​ప్యాక్డ్ బర్త్​డే కానుకలు రాబోతున్నాయి. ఆయన పుట్టినరోజున ఏకంగా రెండు పెద్ద అప్​డేట్​లకు రంగం సిద్ధమైంది.

pawan kalyan
పవన్​ కల్యాణ్

సినిమా హీరోల పుట్టిన రోజు సందడి మాములుగా ఉండదు. అభిమానుల కేకు కట్టింగ్​లు, వేడుకలతో అదిరిపోతుంది. ఇక పవర్​స్టార్​ బర్త్​డే అంటే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నెల రోజుల ముందు నుంచే హడావుడి మొదలవుతుంది. ఆఫ్​లైన్​లో కటౌట్ల నుంచి ఆన్​లైన్​లో బర్త్​డే ట్రెండ్​ల వరకు ఓ పండగ వాతావరణం కనిపిస్తుంది. అందుకోసమే ఈసారి తన పుట్టినరోజు(సెప్టెంబరు 2)న అభిమానులకు పవర్​స్టార్​ రెండు భారీ సర్​ప్రైజ్​లను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

రానా దగ్గుబాటితో కలిసి నటిస్తున్న 'అయ్యపనుమ్ కోషియుమ్' రీమేక్​లో భీమ్లా నాయక్​గా సందడి చేయనున్నారు పవన్. ఈ చిత్రం నుంచి ఆయన పుట్టినరోజు కానుకగా ఓ పాటను విడుదల చేయనున్నట్లు సమాచారం. భీమ్లా నాయక్​ పాత్రకు సంబంధించిన అప్​డేట్​ను శుక్రవారం సాయంత్రం 4.05 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.

pawan kalyan
భీమ్లా నాయక్​గా పవన్

ఇక 'గబ్బర్​సింగ్​' లాంటి బ్లాక్​బస్టర్​ అందించిన హరీశ్ శంకర్​ దర్శకత్వంలో మరో చిత్రం (పీఎస్​పీకే28) చేయనున్నారు పవన్. దానికి సంబంధించిన కొత్త పోస్టర్​ అదే రోజున విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే హరీశ్​ శంకర్​ ఈ పోస్టర్​ను ఓ రేంజ్​లో తీర్చిదిద్దారని వినికిడి.

ఇదీ చూడండి: మెగాస్టార్ 'లూసిఫర్'​ రీమేక్​ షూటింగ్ షురూ

Last Updated : Aug 13, 2021, 2:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.