ETV Bharat / sitara

సమంత నటిస్తున్న వెబ్​ సిరీస్ షూటింగ్ ప్రారంభం

author img

By

Published : Nov 28, 2019, 1:49 PM IST

'ద ఫ్యామిలీ మ్యాన్' వెబ్​ సిరీస్​ రెండో సీజన్​ షూటింగ్ బుధవారం ప్రారంభమైంది. ఇందులో ప్రముఖ హీరోయిన్ సమంత కీలక పాత్ర పోషిస్తోంది.

సమంత నటించే వెబ్​ సిరీస్ షూటింగ్ స్టార్ట్
హీరోయిన్ సమంత

స్టార్ హీరోయిన్​ సమంత వెండితెరపైనే కాకుండా, డిజిటల్ తెరపైనా సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. 'ద ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్​ సిరీస్​లోని కీలక పాత్రలో నటిస్తోంది. రెండో సీజన్​కు సంబంధించిన​ షూటింగ్ బుధవారం ప్రారంభమైంది. ఈ విషయాన్ని ఇన్​స్టా వేదికగా అభిమానులతో పంచుకుందీ భామ. తనకు ఈ అవకాశం ఇచ్చినందుకు దర్శక ద్వయం రాజ్​-డికెకు ధన్యవాదాలు చెప్పింది.

samantha insta post
ఇన్​స్టాగ్రామ్​లో హీరోయిన్ సమంత పోస్ట్​

ఈ సెప్టెంబరు 30న అమెజాన్ ప్రైమ్​లో తొలి సీజన్​ విడుదలైంది. 10 ఎపిసోడ్​లు ఉన్న ఈ సిరీస్..​ నెటిజన్ల నుంచి విపరీతమైన ఆదరణ సొంతం చేసుకుంది. ప్రముఖ నటులు మనోజ్ భాజ్​పాయ్, ప్రియమణి ప్రధాన పాత్రలు పోషించారు. రాజ్ నిడుమోరు-కృష్ణ డికె దర్శకత్వం వహించారు.

ఇది చదవండి: వెబ్​ సిరీస్​ కోసం తీవ్రవాదిగా సమంత..!

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.