ETV Bharat / sitara

వెండితెర మాంత్రికుడు.. సాంకేతికతకు ఆద్యుడు

author img

By

Published : Dec 18, 2019, 9:59 AM IST

తల్లిదండ్రుల గొడవలతో ఒంటరితనాన్ని అనుభవిస్తూ.. తనలోనే ఒక ప్రపంచాన్ని నిర్మించుకున్నాడు స్టీవెన్​ స్పీల్​ బెర్గ్​. ఆ ఊహల్లో నుంచి పుట్టుకొచ్చిన ఎన్నో రూపాలకు సినిమాల రూపంలో ప్రాణం పోశాడు. వాటిని చూసిన ప్రేక్షకులు మంత్రముగ్దులైపోయీరు. నేడు స్పీల్​ బెర్గ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన జీవన ప్రయాణంపై ఓ లుక్కేద్దాం రండి.

Steven Spielberg birth day special story
వెండితెర మాంత్రికుడు.. సాంకేతికతకు ఆద్యుడు

జీవితంలో ఒంటరి తనంతో స్నేహం చేసి, తనదైన స్వప్న ప్రపంచాన్ని అందగా ఆవిష్కరించుకొని, ఆ ఊహా ప్రపంచాన్నే యావత్​ లోకానికి సినిమా రూపంలో బహుకరించాడు. ఆతడే ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు స్టీవెన్​ స్పీల్​ బెర్గ్​. ఆయన సృజనలో పురుడు పోసుకున్న అద్భుత చిత్రాలు ఎన్నో ఉన్నాయి. 'జాస్'​, 'క్లోజ్​ ఎన్​కౌంటర్'​, 'జురాసిక్​ పార్క్​' చిత్రాలు స్పీల్​ బెర్గ్​ సృష్టిలో భాగం. నేడు స్పీల్​ బర్గ్​ పుట్టినరోజు ఈ సందర్భంగా ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.

ఇదీ వ్యక్తిగత జీవితం.

స్పీల్‌బెర్గ్‌ పూర్వికులు 1905లో రష్యా నుంచి అమెరికాకు తరలివెళ్లారు. తండ్రి ఆర్నాల్డ్‌ స్పెల్‌ బెర్గ్‌ కంప్యూటర్‌ ఇంజనీర్‌. తల్లి లీ ఆర్నాల్డ్‌ పియానో కళాకారిణి. ఉద్యోగరీత్యా తండ్రి అనేకానేక ప్రాంతాల్లో నివసించడం కారణంగా స్పీల్‌బెర్గ్‌ తరచూ ఊళ్ళు మారేవాడు. ఇంట్లో తల్లితండ్రుల మధ్య సఖ్యత లేకపోడం వల్ల చిన్నతనంలోనే స్పీల్​ ఒంటరితనంతో జీవించాడు.. కొద్దిరోజుల తర్వాత ఆయన తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. ఆ ఘటన స్పీల్‌బెర్గ్‌ని తీవ్రంగా కలచి వేసింది. ఇంగ్లీష్‌లో తనకు నచ్చని ఒకే ఒక పదం 'డివోర్స్‌' అని స్పీల్‌బెర్గ్‌ తరచూ చెప్తుంటాడు.

Steven Spielberg birth day special story
వెండితెర మాంత్రికుడు.. సాంకేతికతకు ఆద్యుడు

సినీ ప్రస్థానం ఇలా

స్పీల్‌బెర్గ్‌ బ్యాక్‌ బెంచ్‌ స్టూడెంట్‌. స్కూలుకెళ్లడం అంటే అసలు ఇష్టం ఉండేది కాదు. హై స్కూల్‌ స్థాయిలో ఫిజిక్స్‌ సబ్జెక్టులో మూడుసార్లు ఫెయిల్‌ అయ్యాడు. తన పందొమ్మిదేళ్ళ వయసులో కాలిఫోర్నియా స్టేట్‌ యూనివర్సిటీలో ఆంగ్లం అభ్యసించాడు. ఆ సమయంలోనే సమీపంలో ఉన్న యూనివర్సల్‌ స్టూడియోలో రెండు రోజులు గడపాల్సి వచ్చింది. అక్కడే సినిమా ప్రేమలో పడ్డాడు. స్టూడియో వాతావరణం, కెమెరాల సందడి, ఆర్టిస్ట్‌ల హడావుడి, వీటన్నిటికీ ఆకర్షితులయ్యాడు. ఆ తర్వాత ఆయన ధ్యాస, శ్వాస సినిమాయే అయ్యింది. 1958లో 9 నిమిషాల వ్యవధి గల 'ది లాస్ట్‌ గన్‌ ఫైటర్​' సినిమా తీసాడు. బుల్లితెర మొదలుకుని వెండితెర వరకూ తనదయిన ముద్ర వేశాడు. 1968లో 'ఎస్కేప్‌ నో వే' అనే 40 నిముషాల సినిమాని రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో రూపొందించాడు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ప్రళయాన్ని అద్భుతంగా చిత్రీకరించాడు.

స్పీల్​ బెర్గ్​ సృష్టిలో నుంచి వచ్చిన 'షుగర్‌ ల్యాండ్‌ ఎక్స్‌ ప్రె' గొప్ప విజయం సాధించింది. 'జాస్‌' సినిమా ప్రపంచ చలన చిత్రపటంలో చెరగని ముద్ర వేసింది. సముద్రంలో జల విలయాన్ని, ప్రళయాన్ని అత్యద్భుతంగా చిత్రీకరించాడు స్పీల్​ బెర్గ్​. మూడేళ్ళ క్రితం ఈ సినిమా ముచ్చటగా మూడు దశాబ్దాల వేడుకను చేసుకుంది.1981లో 'రైడర్స్‌ ఆఫ్‌ ది లాస్ట్‌ ఆర్క్‌' సూపర్ హిట్​గా నిలిచింది. 'ఇండియానా జోన్స్‌', 'ది టెంపుల్‌ ఆఫ్‌ ది డూమ్‌' చిత్రాలు సాహస చిత్రాలు నిర్మించాలనుకునే ఔత్సాహికులకు పాఠ్య పుస్తకాలుగా నిలిచాయి. ఇక వర్ణ వివక్ష మీద స్పీల్‌బెర్గ్‌ తీసిన చిత్రం 'ది కలర్‌ పర్పుల్‌' 1985లో విడుదలైంది. బుకర్‌ బహుమతి పొందిన ఓ నవల ఆధారంగా తీసిన సినిమా ఇది.

Steven Spielberg birth day special story
వెండితెర మాంత్రికుడు.. సాంకేతికతకు ఆద్యుడు

మైఖేల్‌ క్రిచ్‌ టన్‌ నవల ఆధారంగా 'జురాసిక్‌ పార్క్‌' చిత్రాన్ని స్పీల్‌బెర్గ్‌ రూపొందించాడు. ఈ చిత్రం తర్వాత డైనోసార్లపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి పెరిగింది. పుస్తకాలు, మ్యూజియంలు.. ఇలా వాటికి సంబంధించి అనేక ఆవిష్కరణలు జరిగాయి.

ఆ చిత్రాలతో నడిచొచ్చిన ఆస్కార్​

నాజీల కాలం నాటి ఇతివృత్తం తీసుకుని 1993లో 'షిండ్లర్స్ లిస్ట్'​ చిత్రాన్ని స్పీల్‌బెర్గ్‌ రూపొందించాడు. కలర్‌ చిత్రాలు రాజ్యమేలుతున్న సమయంలో నాజీల చరిత్రని కళ్ళకు కట్టే విధంగా బ్లాక్‌ అండ్‌ వైట్‌లో రూపొందించిన సినిమా ఇది. ఈ చిత్రం ద్వారా ఉత్తమ దర్శకుడిగా స్పీల్​ బెర్గ్​ ఆస్కార్‌ అవార్డు అందుకున్నాడు.

1998లో 'సేవింగ్‌ ప్రైవేట్‌ ర్యాన్​ చిత్రాన్ని యుద్ధ భీభత్సం నేపథ్యంలో రూపొందించాడు. ఈ సినిమాకు రెండోసారి ఆస్కార్‌ అవార్డుని అందుకున్నాడు. 2002లో ‘మైనార్టీ రిపోôర్ట్​, 'క్యాచ్‌ మీ యు కెన్‌' సినిమాలు సంచలన విజయాల్ని నమోదు చేశాయి. ఇక 2004లో 'ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌' చిత్రం ద్వారా రోబోలు సమాజంలో ఎంతటి ప్రభావం చూపిస్తాయో చూపించాడు. 2005లో హెచ్‌. జి .వెల్స్‌ నవల 'వార్‌ ఆఫ్‌ ది వరల్డ్స్‌' తెరకి ఎక్కించాడు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

సాంకేతికతకు పెద్దపీట

వెండి తెరపై సాంకేతిక ప్రదర్శనకు పరాకాష్ట ‘జురాసిక్‌ పార్క్‌’ 1993లో 'జురాసిక్‌ పార్క్‌' తీసిన స్పీల్‌బెర్గ్‌.. 1997లో 'ది లాస్ట్‌ వరల్డ్‌' పేరుతో జురాసిక్‌ పార్క్‌ రెండో భాగాన్ని తీశారు. 2011లో 'ది అడ్వెంచర్స్‌ ఆఫ్‌ టిన్‌ టిన్', 'వార్‌ హౌ' సినిమాలు రూపొందించాడు. 2012లో 'లింక్లో', 2015లో 'బ్రిడ్జి ఆఫ్‌ స్పై', 2016లో 'ది బి ఎఫ్‌ జి', 2017లో 'ది పోస్ట్‌', 2018లో 'రెడీ ప్లేయర్‌ వన్‌' చిత్రాలు స్పీల్‌బెర్గ్‌ దర్శకత్వంలో తెరకెక్కాయి.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
EUROPEAN UNION - AP CLIENTS ONLY
Strasbourg - 17 December 2019
1. SOUNDBITE (English) Vera Jourova, European Union Vice-President, Values and Transparency:
++VARIOUS ANGLES++
"One of the top priorities for Malta is to strengthen the independence of the judiciary. In particular, the safeguards for judicial appointments and dismissals and to establish a separate and fully independent prosecution service. There is also a need to strengthen efforts to detect and prosecute corruption and the enforcement of the anti money laundering framework. I am aware that the Maltese authorities have at several occasions expressed their intention to proceed with the necessary reforms in the areas of concern I have mentioned. But there is still a lack of significant progress."
++BLACK FRAMES++
2. SOUNDBITE (English) Vera Jourova, European Union Vice-President, Values and Transparency:
++VARIOUS ANGLES++
"The recent visit of the European Parliament's delegation in Malta and today's debate are of great importance. As (European Commission) President (Ursula) von der Leyen made clear, she is concerned by recent developments in Malta. The commission has been following the developments in Malta very closely. The commission condemns the assassination of journalist Daphne Caruana Galizia. Her murder was an attack on the free media and is a grave concern off to Europe as a whole."
3. SOUNDBITE (English) Sophie In 't Veld, Dutch Member of European Parliament:
++VARIOUS ANGLES++
"This is an issue of taking political responsibility for the for the health of the democratic rule of law in the European Union as a whole. Because if we don't do it and if we don't do it now, this disease will spread."
++BLACK FRAMES++
4. SOUNDBITE (English) Sophie In 't Veld, Dutch Member of European Parliament:
"Now, the question is, at the end of this, will we be able to look ourselves in the eyes? Will we be able to look into the eyes of the family of Daphne Caruana Galizia and say that we have done everything in our power?"
++ENDS ON SOUNDBITE++
STORYLINE:
The European Union has vowed to "strengthen the independence" of Malta's judiciary following the murder of journalist Daphne Caruana Galizia.
Speaking in Strasbourg on Tuesday, EU Values and Transparency Vice-President Vera Jourova said that it was "one of the top priorities" to "establish a seperate and fully indepedent prosecution service" in the country.
Jourova also said that more needed to be done to "strengthen efforts to detect and prosecute corruption."
Her comments in parliament come as calls continue for Maltese Prime Minister Joseph Muscat to resign from his role amid speculation his former chief-of-staff was implicated in Galizia's murder in 2017.
Keith Schembri, who denies any wrongdoing in the matter, was questioned by police in November.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.