ETV Bharat / sitara

నటి సంజనకు అసభ్యకర మెసేజ్​లు.. కొరియోగ్రాఫర్ కుమారుడి అరెస్ట్​

author img

By

Published : Mar 4, 2022, 9:55 PM IST

Sanjana Galrani: నటి సంజన గల్రానికి అసభ్యకర మెసేజ్​లు పంపాడు ప్రముఖ కొరియోగ్రాఫర్​ ప్రసాద్​ బిడప కుమారుడు ఆడమ్​ బిడప. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.

sanjana galrani
నటి సంజన గల్రాని

Sanjana Galrani: నటి సంజన గల్రానితో అసభ్యకర సందేశాలు పంపాడు ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రసాద్​ బిడప​ కుమారుడు ఆడమ్ బిడప. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన ఇందిరానగర్​ పోలీసులు అతడిని అరెస్ట్​ చేసి విచారిస్తున్నారు.

ఆడమ్​ ఫిబ్రవరి 25 రాత్రి ఈ సందేశాలు పంపినట్లు పోలీసులు తెలిపారు. తనపై వేధింపులకు సంబంధించిన చాట్​ వివరాలను సంజన పోలీసులకు అందించింది.

నటి సంజన తెలుగులో 'బుజ్జిగాడు' సినిమాలో మెరిసింది. 'దండుపాల్యం-2'లోనూ నటించింది.

ఇదీ చదవండి: గాలి జనార్థన్​రెడ్డి కుమారుడి సినీరంగ ప్రవేశం.. ఆది కొత్త సినిమా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.