ETV Bharat / sitara

సెట్స్ పైకి వెళ్లనున్న సమంత 'శాకుంతలం'

author img

By

Published : Feb 26, 2021, 11:47 AM IST

Updated : Feb 26, 2021, 12:57 PM IST

అగ్రకథానాయిక సమంత ప్రధానపాత్రలో నటించనున్న 'శాకుంతలం' చిత్రీకరణను వచ్చే నెలలో ప్రారంభించనున్నారని సమాచారం. దానికి తగ్గట్టుగా చిత్రబృందం ప్రీ ప్రొడక్షన్​ పనులను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

Samantha's Shaakuntalam to kick-start on this date
సెట్స్ పైకి వెళ్లనున్న సమంత 'శాకుంతలం'

ప్రముఖ దర్శకుడు గుణశేఖర్‌ తెరకెక్కిస్తున్న సరికొత్త చిత్రం 'శాకుంతలం'. మహాభారతంలోని ఆదిపర్వంలో శకుంతల, దుష్యంతుల ప్రేమకథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో సమంత ప్రధానపాత్ర పోషిస్తుంది. ఈ చిత్రానికి భారీ సెట్స్ చాలా అవసరం. అందుకు తగ్గట్లుగానే గుణశేఖర్‌ ఆ పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారని సమాచారం.

ఈ సినిమా షూటింగ్‌ను మార్చి 20న ప్రారంభించే ఆలోచనలో చిత్రబృందం ఉందట. అందుకు అనుగుణంగా సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. పాన్‌ ఇండియా సినిమాగా రూపొందిస్తున్నట్లు ఆ మధ్య విడుదల చేసిన మోషన్‌ పోస్టర్‌లో వెల్లడించారు. మణిశర్మ స్వరాలు సమకూరుస్తుండగా నీలిమ గుణ నిర్మిస్తున్నారు.

ఇదీ చూడండి: సమంత 'శాకుంతలం' సెట్స్ చూస్తారా?

Last Updated :Feb 26, 2021, 12:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.