ETV Bharat / sitara

ఒక్కో ఇన్​స్టా పోస్ట్​కు సమంత సంపాదన ఎంతంటే?

author img

By

Published : Mar 28, 2022, 5:47 PM IST

Updated : Mar 28, 2022, 6:01 PM IST

samantha
సమంత

Samantha insta post remuneration: గత కొద్ది కాలంగా హీరోయిన్​ సమంత సోషల్​మీడియాలో చురుగ్గా ఉంటున్నారు. అలానే నెటిజన్లు కూడా ఆమె పెట్టే పోస్ట్​లను వీక్షించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె ఈ పోస్ట్​ల ద్వారా ఎంత ఆర్జిస్తున్నారో వార్త ఒకటి బయటకు వచ్చింది. ఇంతకీ ఆమె ఒక్కో పోస్ట్​ విలువ ఎంతో తెలుసుకుందాం..

Samantha insta post remuneration: విడాకుల అనంతరం స్టార్​ హీరోయిన్​ సమంత కెరీర్​లో జోరు ప్రదర్శిస్తున్నారు. వాణిజ్య ప్రకటనల్లోనూ దూకుడు ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా సోషల్​మీడియాలో చురుగ్గా ఉంటున్నారు. ఓ వైపు స్ఫూర్తిదాయకమైన పోస్టులు పెడుతూనే.. మరోవైపు తనను విమర్శించినవారికి దీటుగా సమాధానం చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఆమె పెట్టే పోస్టులను వీక్షించడానికి నెటిజన్లు ఆసక్తి కనబరుస్తున్నారు.

దీంతో చాలా బ్రాండ్​లు తమ ఉత్పత్తులను ప్రమోట్​ చేసేందుకు సమంత ఇన్​స్టాను వేదికగా మలుచుకుంటున్నాయి. ఈ క్రమంలోనే సామ్​కు వాణిజ్య ప్రకటన డిమాండ్​ పెరిగిపోయింది. పెట్టే ప్రతి పోస్ట్​కు రూ.25లక్షల నుంచి రూ.30లక్షల వరకు సామ్​ ఆర్జిస్తున్నట్లు తెలిసింది. కేవలం పోస్ట్​లకు మాత్రమే ప్రత్యేకించి ఏమైనా ఫొటోషూట్స్​, వీడియోలు చేయాల్సి వస్తే వాటికి అదనంగా రెండు నుంచి మూడు రెట్లు ఎక్కువ డిమాండ్​ చేస్తున్నారని వినికిడి. దీని ప్రకారం ఆమె సినిమాల పరంగానే కాకుండా.. సోషల్​మీడియా పోస్ట్​ల ద్వారా కూడా బాగానే ఆర్జిస్తున్నట్లు అంతా మాట్లాడుకుంటున్నారు. త్వరలోనే ఆమె గుణశేఖర్​ దర్శకత్వంలో తెరకెక్కిన 'శాకుంతలం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

ఇదీ చూడండి: విల్​స్మిత్​ ఆస్కార్​ను వెనక్కి తీసేసుకుంటారా?

Last Updated :Mar 28, 2022, 6:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.