ETV Bharat / sitara

సల్మాన్​ 'అంతిమ్'​ ట్రైలర్​.. నాగశౌర్య కోసం బన్నీ

author img

By

Published : Oct 25, 2021, 10:12 PM IST

Updated : Oct 25, 2021, 10:45 PM IST

మరికొన్ని సినిమా అప్డేట్స్​ వచ్చాయి. వాటిలో సల్మాన్​ ఖాన్​ 'అంతిమ్' ట్రైలర్​, 'లవ్​స్టోరీ' మలయాళ ట్రైలర్​ సహా పలు చిత్రాల విశేషాలు ఉన్నాయి.

cine
సినిమా అప్డేట్స్​

బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'అంతిమ్: ది ఫైనల్‌ ట్రూత్‌'(salman khan antim movie trailer). ఆయుష్‌ శర్మ కీలకపాత్ర పోషించాడు. మహేశ్‌ వి.మంజ్రేకర్‌ దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది(salman khan antim movie). సోమవారం ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇందులో సల్మాన్‌ సిక్కు పోలీసు అధికారిగా కనిపించారు. గ్యాంగ్‌స్టర్స్‌కు, పోలీసులకు మధ్య జరిగే పోరాటం నేపథ్యంలో ఈ కథ సాగుతుందని ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. నవంబరు 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. ప్రముఖ నటుడు, దర్శకుడు మహేష్‌ మంజ్రేకర్‌ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

శేఖర్​కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన సినిమా 'లవ్​స్టోరీ'(lovestory movie) ఇటీవల విడుదలై సూపర్​హిట్​గా నిలిచింది. ఇప్పడీ చిత్రాన్ని 'ప్రేమతీరమ్​' పేరుతో మలయాళంలో అక్టోబర్​ 29న విడుదల చేయనున్నారు(lovestory movie release date). ఈ సందర్భంగా సోమవారం(అక్టోబర్​ 25) దీనికి సంబంధించిన ట్రైలర్​ను విడుదల చేసింది చిత్రబృందం.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

తమిళ హీరో శివకార్తికేయన్(siva karthikeyan movie list)​ నటించిన 'వరుణ్​ డాక్టర్'​(varun doctor movie) సినిమా ఇటీవల విడుదలై పాజిటివ్​ టాక్​ తెచ్చుకుంది. ఇప్పుడీ మూవీ ఓటీటీ వేదికగా సందడి చేసేందుకు సిద్ధమైంది. సన్​నెక్ట్స్​లో నవంబరు 4నుంచి స్ట్రీమింగ్​ కానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

నాగశౌర్య, రీతూవర్మ జంటగా నటించిన 'వరుడుకావలెను'(varudu kaavalenu pre release event) సినిమా ప్రీరిలీజ్​ ఈవెంట్​ అక్టోబర్​ 27న నిర్వహించనున్నారు. ఈ వేడుకకు హీరో అల్లుఅర్జున్​ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు (naga shaurya ritu varma movie). ఈ చిత్రానికి లక్ష్మి సౌజన్య దర్శకత్వం వహించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. తమన్‌ సంగీతమందించారు. మురళీ శర్మ, నదియా, వెన్నెల కిశోర్‌, ప్రవీణ్‌, హర్ష తదితరులు కీలక పాత్రలు పోషించారు. అక్టోబర్​ 29న విడుదల కానుందీ సినిమా.

varudu
వరుడు కావలెను

ఇదీ చూడండి: 'పుష్ప' సాంగ్​ ప్రోమో.. 'రొమాంటిక్'​ కొత్త ట్రైలర్​​

Last Updated : Oct 25, 2021, 10:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.