ETV Bharat / sitara

'మారువేషంలో వస్తా.. నాకు నీ డైరెక్షన్ నేర్పించు'

author img

By

Published : Mar 23, 2022, 1:14 PM IST

RRR Movie Interview: 'ఆర్​ఆర్​ఆర్'​ చిత్రీకరణకు సంబంధించిన అనేక రహస్యాలను చెప్పారు దర్శకధీరుడు రాజమౌళి. మార్చి 25న చిత్ర విడుదల ఉన్న నేపథ్యంలో.. అర్జున్​ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో కలిసి ముచ్చటించారు.

RRR Movie Interview
సందీప్​రెడ్డితో రాజమౌళి ఇంటర్వ్యూ

RRR Movie Interview: 'ఆర్​ఆర్​ఆర్'​ చిత్రంలోని అనేక సన్నివేశాలకు సంబంధించిన సీక్రెట్లు చెప్పారు దర్శకుడు రాజమౌళి. ఎన్టీఆర్​.. పులితో, రామ్​చరణ్ 2వేల మంది ఆర్టిస్టులతో చేసిన సన్నివేశాల వెనకున్న రహాస్యాలను విప్పారు జక్కన్న. చిత్ర ప్రచారంలో భాగంగా 'అర్జున్​రెడ్డి' దర్శకుడు సందీప్​రెడ్డి వంగా చేసిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.

"కొమురం భీమ్​, అల్లూరి సీతారామరాజు కలిసి చాయ్​ తాగితే ఎలా ఉంటుంది? కర్ణుడికి, కృష్ణుడికి మధ్య స్నేహం ఉంటే ఎలా ఉంటుంది? లాంటి ప్రశ్నల నుంచి ఈ కథ వచ్చింది" అని జక్కన్న అన్నారు. సందీప్​ రెడ్డి వంగా దగ్గర అసిస్టెంట్​ డైరెక్టర్​గా పనిచేసే అవకాశం ఇవ్వాలని కోరారు రాజమౌళి. అవసరమైతే మారువేషంలో వస్తానని చెప్పారు.

రాజమౌళి.. 'ఆర్‌ఆర్‌ఆర్‌'తో తారక్‌, చరణ్‌ను ఒకే ఫ్రేమ్‌లో చూపించబోతున్నారు. అల్లూరి సీతారామరాజు (నిప్పు), కొమురం భీమ్‌ (నీరు)ల స్నేహం గురించి తెలియజేయనున్నారు. 1920లో సాగే ఈ చిత్రం సుమారు రూ. 400 కోట్లతో రూపొందింది. ఇప్పటికే విడుదలైన పాటలు, ప్రచార చిత్రాలు రికార్డు స్థాయిలో వ్యూస్‌ సొంతం చేసుకున్నాయి. రాజమౌళి- ఎన్టీఆర్‌ కాంబోలో తెరకెక్కిన 4వ సినిమాగా, రాజమౌళి- రామ్‌చరణ్‌ కాంబినేషన్‌లో రూపొందిన 2వ చిత్రంగా 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినీ ప్రియుల్ని ఊరిస్తోంది.

'బాహుబలి' తర్వాత రాజమౌళి దర్శకత్వం వహించిన చిత్రం కావడం వల్ల యావత్​ సినీ అభిమానులు 'ఆర్​ఆర్​ఆర్​' చిత్రం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మార్చి 25న విడుదల కానుంది. ఈ చిత్ర ప్రచారంలో భాగంగా 'అర్జున్​రెడ్డి' దర్శకుడు సందీప్​రెడ్డి వంగాతో కలిసి ముచ్చటించారు జక్కన్న. పూర్తి ఇంటర్వ్యూ మీరూ చూసేయండి..

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చదవండి: తారక్​తో అలా.. చెర్రీతో ఇలా.. 'ఆర్ఆర్ఆర్' కాంబినేషన్లు అదుర్స్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.