ETV Bharat / sitara

ఆ రీమేక్​కు నో చెప్పిన హీరోయిన్ రష్మిక?

author img

By

Published : May 18, 2021, 5:31 AM IST

హిందీలో కార్తిక్ ఆర్యన్​ హీరోగా, 'కిరిక్ పార్టీ' రీమేక్​ తెరకెక్కిస్తున్నారు. అయితే ఇందులో హీరోయిన్​ పాత్ర కోసం రష్మికను సంప్రదించగా, ఆమె చేయనని చెప్పిందట.

Rashmika kirik party
రష్మిక

టాలీవుడ్​, బాలీవుడ్​లో అగ్రహీరోలతో నటిస్తూ బిజీగా ఉంది హీరోయిన్ రష్మిక. అయితే ఆమె ఇటీవల ఓ రీమేక్​కు నో చెప్పిందని టాక్ వినిపిస్తోంది. ఆ విషయాన్ని పరోక్షంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

కన్నడ సినిమా 'కిరిక్ పార్టీ' సినిమాతో హీరోయిన్​గా పరిచయమైన రష్మిక.. ఆ తర్వాత తెలుగులోనూ పలు సినిమాలతో హిట్​లు కొట్టి, స్టార్ హోదా సంపాదించింది. ఇప్పుడు అల్లు అర్జున్​ 'పుష్ప'తో పాటు బాలీవుడ్​ అమితాబ్​తో కలిసి నటిస్తోంది. అయితే 'కిరిక్ పార్టీ' హిందీ రీమేక్​ కోసం ఆమెను సంప్రదించగా, చేయనని చెప్పిందట. అందుకు గల కారణాన్ని ఆ తర్వాత వెల్లడించింది.

Rashmika not interested in kirik party hindi remake?
హీరోయిన్ రష్మిక

"నేను 'కిరిక్ పార్టీ' రీమేక్​లో నటించను. ఏదైనా పాత్ర చేసేటప్పుడు ఎమోషన్స్​ను అప్పుడే బాగా చేయగలం. మళ్లీ అదే పాత్ర చేయడం నా వల్ల కాదు. నేనేప్పుడు కొత్త పాత్రల్ని, కథల్ని ప్రేక్షకులకు చెప్పేందుకు ఇష్టపడతాను" అని రష్మిక చెప్పింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.