ETV Bharat / sitara

ఆ విషయాలు ఎంత మాట్లాడినా వృథానే: రష్మిక

author img

By

Published : May 1, 2021, 6:24 AM IST

తన ఎన్ని హిట్​లు వచ్చినా కన్నడలో చేసిన తొలి సినిమానే ఇష్టమని హీరోయిన్ రష్మిక వెల్లడించింది. అనవసర విషయాల గురించి మాట్లాడటం వృథా అని చెప్పింది. ప్రస్తుతం ఈ భామ బన్నీతో కలిసి 'పుష్ప'లో నటిస్తోంది.

rashmika kirik party
రష్మిక

"నిజాయతీగా నా గురించి పదిమంది తెలుసుకోవల్సిన విషయం ఏదైనా ఉందనిపిస్తే దాని గురించి మాట్లాడటానికి ఇష్టపడతాను" అని అంటోంది హీరోయిన్ రష్మిక. ఈ చెవితో విని, ఆ చెవి నుంచి వదిలేసే విషయాల గురించి ఎంత మాట్లాడినా వృథానే కదా అని అంటోందామె.

దక్షిణాదితోపాటు, హిందీలోనూ అవకాశాల్ని అందుకొంటూ దూసుకెళుతున్న కథానాయిక రష్మిక. ఈమెకు ఎన్ని విజయాలు సొంతమైనా, కన్నడలో చేసిన తొలి సినిమానే ఇష్టమని చెప్పుకొచ్చింది. తన జీవితంలో పని నేర్పించిన విషయాలే ఎక్కువ అని, కొత్త భాషలు కూడా వృత్తిలో భాగంగానే నేర్చుకున్నానని, ఎక్కడ అవకాశం వస్తే అక్కడ భాషపై దృష్టి పెడుతుంటానని చెప్పింది. పసుపు పచ్చ రంగు అంటే ఇష్టమని, అది తనలో పాజిటివిటీని పెంచుతుందని వెల్లడించింది. తెలుగులో అల్లు అర్జున్‌తో 'పుష్ప'లో నటిస్తున్న ఈమె.. తదుపరి రామ్‌ చరణ్‌తో పనిచేయనున్నట్లు సమాచారం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.