ETV Bharat / sitara

'భీమ్లానాయక్​' ట్రీట్​.. ఒకే ఫ్రేమ్​లో చిరు, పవన్​!

author img

By

Published : Feb 24, 2022, 1:25 PM IST

Bheemlanayak Ramcharan: 'భీమ్లానాయక్'​ సినిమా రిలీజ్​కు సిద్ధమైన నేపథ్యంలో చిత్రబృందానికి అభినందనలు తెలిపారు హీరో రామ్​చరణ్​. చిరంజీవి, పవన్​కల్యాణ్​కు సంబంధించిన ఓ స్పెషల్​ వీడియోను సోషల్​మీడియాలో పోస్ట్​ చేశారు. ఆ వీడియో అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది.

bheemlanayk
భీమ్లానాయక్​

Bheemlanayak Ramcharan: పవన్​కల్యాణ్​ నటించిన 'భీమ్లానాయక్'​ విడుదల కానున్న నేపథ్యంలో మెగాహీరో రామ్​చరణ్​ హర్షం వ్యక్తం చేశారు. పవన్​ చిత్రబృందానికి అభినందనలు తెలుపుతూ ఓ స్పెషల్​ వీడియోను పోస్ట్​ చేశారు. ఈ సినిమా షూటింగ్​ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో చిత్రీకరించారు. అదే సమయంలో 'భీమ్లానాయక్‌' షూట్​ జరిగిన లొకేషన్స్‌లోనే మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తోన్న 'గాడ్‌ఫాదర్‌' చిత్రీకరణ కూడా జరిగింది. అలా, చిరు.. పవన్‌ సినిమా సెట్‌లోకి అడుగుపెట్టి అందర్నీ ఆశ్చర్యపరిచారు. చిత్రబృందంతో కాసేపు సరదాగా మాట్లాడి ఫొటోలు దిగారు.

అనంతరం కొన్నిరోజులకు ‘గాడ్‌ఫాదర్‌’ షూట్‌ జరిగిన లొకేషన్స్‌లో ‘భీమ్లానాయక్‌’ షూట్‌ కూడా జరగడం వల్ల.. ఈసారి పవన్‌.. తన అన్నయ్య సినిమా సెట్‌లోకి అడుగుపెట్టారు​. అదే సమయంలో అక్కడ ఉన్న నటుడు ఆర్‌.నారాయణమూర్తి, మాటల రచయిత విజయేంద్రప్రసాద్‌తోపాటు ఇతర చిత్రబృందంతో కొద్దిసేపు మాట్లాడారు.

తాజాగా దానికి సంబంధించిన వీడియోనే చరణ్​ సోషల్​మీడియాలో పోస్ట్​ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోను చూసిన మెగా పవర్‌ అభిమానులు ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు. 'చరణ్‌ మామ.. నువ్వు సూపర్‌.. భలే వీడియో షేర్‌ చేశావ్‌', 'అన్నదమ్ములిద్దర్నీ ఒకే ఫ్రేమ్‌లో ఇలా చూస్తుంటే పండుగలా ఉంది' అంటూ తమ ఆనందాన్ని కామెంట్ల రూపంలో బయటపెడుతున్నారు.


ఇదీ చూడండి: ఒకే సినిమాతో ముగ్గురు స్టార్​ వారసులు ఎంట్రీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.