Ram Gopal Varma: హనుమకొండలో రామ్​గోపాల్​ వర్మ 'కొండా' షూటింగ్

author img

By

Published : Oct 12, 2021, 1:44 PM IST

Ram Gopal Varma, konda movie updates

హనుమకొండలో ప్రముఖ దర్శకుడు రామ్​గోపాల్ వర్మ(Ram Gopal Varma) సందడి చేశారు. ఆయనకు కొండా సురేఖ దంపతులు ఘనస్వాగతం పలికారు. వర్మను చూడడానికి అభిమానులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.

హనుమకొండ జిల్లా కేంద్రంలో ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ(Ram Gopal Varma) సందడి చేశారు. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి జీవిత చరిత్ర ఆధారంగా రాంగోపాల్ వర్మ తీస్తున్న కొండా బయోపిక్(konda movie launch news) షూటింగ్ కోసం హనుమకొండకు వచ్చారు. ఈ సందర్భంగా వర్మకు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, మాజీ మంత్రి కొండా సురేఖ ఘన స్వాగతం పలికారు. వంచనగరిలో కొండా బయోపిక్​ను ప్రారంభించడానికి వారు బయలుదేరారు. వర్మ రాకతో స్థానికంగా సందడి నెలకొంది. హనుమకొండకు వచ్చిన వర్మను చూడడానికి ఆయన అభిమానులు తరలివచ్చారు.

Ram Gopal Varma, konda movie updates
వర్మకు ఘన స్వాగతం

'తెలంగాణ రక్తచరిత్ర'

వివాదాస్పద చిత్రాలకు కేరాఫ్​ అడ్రస్ రామ్​గోపాల్ వర్మ(Ram Gopal Varma Latest News). హారర్​, ఫ్యాక్షనిజం, రౌడీయిజం నేపథ్యంలో ఇప్పటికే పలు చిత్రాలు తెరకెక్కించారు. ఈ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర హిట్​గా నిలిచిన మాట అటుంచితే.. ఈ కథాంశాలతోనే వర్మ మరింత పాపులర్ అయ్యారు. విజయవాడ రౌడీయిజం నేపథ్యంలో సాగే 'రక్త చరిత్ర' సినిమా తీసిన ఆర్జీవీ ఇప్పుడు 'తెలంగాణలో జరిగిన రక్తచరిత్ర'పై సినిమా తీస్తున్నట్లు చెప్పారు. దీనికి సంబంధించిన ఓ వాట్సాప్​ ఆడియో గతంలో వైరల్​ అయింది.

Ram Gopal Varma, konda movie updates
కొండా దంపతులను కలిసిన వర్మ

గతంలో క్లారిటీ

వరంగల్​ ములుగు రోడ్​లోని ఎల్​బీ కళాశాలకు వెళ్లిన వర్మ... ఈ సినిమాపై క్లారిటీ ఇచ్చారు. కొండా మురళి దంపతుల(RGV Konda Murali) కథాంశంతో తాను తీయబోయే సినిమా కోసమే వరంగల్​ వెళ్లినట్లు తెలిపారు. అయితే.. వైరల్​ అయిన ఆ ఆడియోలో సినిమాకు సంబంధించిన అన్ని విషయాలపై క్లారిటీ ఇచ్చారు వర్మ. ఈ సినిమా ఎందుకు తీయాలనుకుంటున్నారో వివరించారు.

"విజయవాడలో చదవడం మూలాన నాకు అక్కడి రౌడీల గురించి తెలుసు. రామానాయుడు స్టూడియో దగ్గర జరిగిన బ్లాస్ట్ మూలాన రాయలసీమ ఫ్యాక్షనిస్టుల గురించి తెలుసు. తెలంగాణ సాయుధ పోరాటం గురించి మాత్రం ఏమీ తెలియదు. కానీ, ఇటీవలే కొంతమంది మాజీ నక్సలైట్లు, అప్పటి పోలీసు అధికారులను కలిశాక మొదటిసారిగా ఈ సబ్జెక్ట్​పై అవగాహన వచ్చింది. కొండా మురళిని కూడా కలిసి ఈ సినిమాకు సహకరించాలని కోరా."

-రామ్​ గోపాల్ వర్మ, డైరెక్టర్

ఈ ప్రకటన సమయంలో కారల్ మార్క్స్​ను గుర్తుచేసుకున్న వర్మ.. 'విప్లవం ఎప్పటికీ ఆగదు.. కేవలం రూపు మార్చుకుంటుంది' అని చెప్పారు. కొండా సినిమా షూటింగ్ వరంగల్ పరిసరాల్లో ఉంటుందని తెలిపారు. ఈ సినిమా ఎలాంటి వివాదాలకు తెరలేపుతుందో, తాననుకున్న సబ్జెక్ట్​ను అనుకున్నట్లుగా వర్మ తెరకెక్కించగలిగారా అన్నది షూటింగ్ పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు వస్తే గానీ తెలియదు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది.

ఇదీ చదవండి: Rajath Kumar Comments: 'కృష్ణా జలాల్లో 50 శాతం వాటా కోరుతున్నాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.