ETV Bharat / sitara

Ramcharan-Shankar: రామ్​చరణ్ రచ్చ.. వచ్చే నెల నుంచి!

author img

By

Published : Jul 4, 2021, 9:25 PM IST

Updated : Jul 5, 2021, 12:06 PM IST

RAM CHARAN SHANKAR MOVIE START FROM AUGUST
రామ్​చరణ్ శంకర్ సినిమా

ప్రముఖ కథానాయకుడు రామ్​చరణ్ కొత్త సినిమా వచ్చే నెల నుంచి షురూ కానుంది. నిర్మాత దిల్​రాజు, దర్శకుడు శంకర్​తో ఆదివారం భేటీ అయి.. షూటింగ్​ ఎప్పుడు ప్రారంభించాలనే దానిపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

మెగాహీరో రామ్​చరణ్​ కొత్త సినిమాకు అడ్డంకులు తొలగిపోయాయి. హైకోర్టులో దర్శకుడు శంకర్​కు ఊరట లభించింది. వీరిద్దరి కాంబినేషన్​లో తెరకెక్కే చిత్రానికి మార్గం సుగమమైంది. దీంతో వచ్చే నెల షూటింగ్​ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయమై నిర్మాత దిల్​రాజు, శంకర్, హీరో రామ్​చరణ్.. చెన్నై​లో ఆదివారం సమావేశమయ్యారు. సినిమా గురించి వారు చర్చించుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా నుంచి త్వరలోనే ఓ అప్​డేట్​ రానుందని హీరో రామ్ చరణ్​ సహా నిర్మాణసంస్థ ట్విట్టర్​లో వెల్లడించారు.

ఈ సినిమాకు తమన్ సంగీతమందిస్తుండగా, కియారా అడ్వాణీని హీరోయిన్​గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. భారీ బడ్జెట్​తో రూపొందే ఈ చిత్రం.. రాజకీయ నేఫథ్య కథతో తీయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

RAM CHARAN SHANKAR MOVIE
రామ్ చరణ్ - శంకర్ మూవీ

ఇది కాకుండా కమల్​హాసన్​తో 'భారతీయుడు 2' సినిమా చేస్తున్నారు శంకర్. ఆ చిత్ర నిర్మాతలతో వివాదం కారణంగా ప్రస్తుతం ఆ ప్రాజెక్టు మధ్యలో నిలిచిపోయింది. మరోవైపు 'ఆర్ఆర్ఆర్'తో బిజీగా ఉన్నారు రామ్​చరణ్. మరో రెండు పాట చిత్రీకరణ మాత్రమే మిగిలున్న నేపథ్యంలో, వీలైనంత త్వరగా దానిని పూర్తి చేసి.. తన తర్వాతి సినిమాలపై దృష్టిసారించాలని చరణ్ భావిస్తున్నారు.

ఇవీ చదవండి:

Last Updated :Jul 5, 2021, 12:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.