ETV Bharat / sitara

'అరెస్టు తప్పించుకునేందుకు రూ. 25 లక్షల లంచం!'

author img

By

Published : Jul 23, 2021, 9:44 AM IST

ఫోర్న్​ చిత్రాల కేసులో భాగంగా తనను అరెస్టు చేయకుండా ఉండేందుకు రాజ్​ కుంద్రా.. భారీ మొత్తం లంచం ఇచ్చారని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఏసీబీ అధికారులు వెల్లడించారు.

Raj Kundra paid 25 lakh bribe to evade police arrest
రాజ్ కుంద్రా

అశ్లీల చిత్రాల కేసులో అరెస్టయిన ప్రముఖ పారిశ్రామికవేత్త రాజ్​కుంద్రా.. పోలీసులకు భారీ మొత్తంలో లంచం ఇచ్చారని తెలుస్తోంది. ఈ విషయాన్ని అవినీతి నిరోధక శాఖ వెల్లడించింది. ఇదే కేసులో అరెస్టయిన యష్ ఠాకుర్​ నుంచి తమకు నాలుగు ఈమెయిల్స్ వచ్చాయని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు. రూ. 25 లక్షలు లంచం ఇచ్చినట్లు అందులో ఉందని తెలిపారు. వీటిని ముంబయి పోలీసులకు ఫార్వర్డ్​ చేశామని, త్వరలో వారు దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారని వెల్లడించారు.

Raj Kundra
రాజ్ కుంద్రా

ఆశ్లీల చిత్రాల కేసులో సోమవారం(జులై 19) రాత్రి రాజ్ కుంద్రాతో పాటు మరో 11 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయనకు సంబంధించిన ఒక్కో విషయం బయటకొస్తోంది.

లండన్​కు చెందిన ఓ కంపెనీతో పార్ట్​నర్​గా ఉన్న రాజ్ కుంద్రా.. 'హాట్​షాట్స్' యాప్​ ద్వారా అశ్లీల చిత్రాలు తెరకెక్కిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. వెబ్ సిరీస్​ల్లో అవకాశాల పేరు చెప్పి, న్యూడ్ సన్నివేశాల్లో నటించేలా చేస్తున్నారని మోడల్​ సాగరిక.. కుంద్రాపై ఆరోపణలు చేసింది.

raj kundra shilpa shetty
రాజ్ కుంద్రా, ఆయన భార్య శిల్పాశెట్టి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.