ETV Bharat / sitara

అందుకే ప్రభాస్​ పెళ్లి ఆలస్యం: కృష్ణంరాజు సతీమణి

author img

By

Published : Mar 10, 2022, 4:19 PM IST

Prabhas Marriage: పాన్​ఇండియా స్టార్​ ప్రభాస్​ నటించిన 'రాధేశ్యామ్'​ సినిమా కోసం ఫ్యాన్స్​ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే తమ అభిమాన హీరో​ పెళ్లి గురించి కూడా అంతే ఆత్రుతగా ఉన్నారు. ఈ నేపథ్యంలో డార్లింగ్ ​పెళ్లిపై కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

radheshyam
prabhas

Prabhas Marriage: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులందరూ 'రాధేశ్యామ్‌' కోసం ఎంత ఆత్రుతగా ఉన్నారో.. ప్రభాస్‌ పెళ్లి కోసమూ అంతే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన డేటింగ్‌లో ఉన్నారని సోషల్‌మీడియా వేదికగా పలు వార్తలు వచ్చాయి. ప్రభాస్‌ పెళ్లిపై ఆయన పెద్దమ్మ, కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి స్పందించారు. ప్రభాస్‌ వ్యక్తిత్త్వంపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్‌-కృష్ణంరాజు మధ్య ఉన్న అనుబంధం చూస్తే ఆనందంతో కన్నీళ్లు వచ్చేస్తాయని ఆమె అన్నారు.

krishnamraju
పెద్దనాన్నతో ప్రభాస్​

"ప్రభాస్‌కు చిన్నప్పటి నుంచి పెద్దలంటే ఎంతో గౌరవం. పెద్దలతో ఎంతో మర్యాదగా వ్యవహరిస్తాడు. వాళ్లమ్మ అంటే అమితమైన ప్రేమ, గౌరవం. మా కుటుంబం మొత్తాన్ని ఎంతో బాగా చూసుకుంటాడు. ఇక, పెదనాన్న అంటే మాటల్లో చెప్పలేనంత ఇష్టం. గతేడాది కృష్ణంరాజుగారి కాలికి చిన్న గాయమైంది. దానికి సర్జరీ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో నాకెంతో భయం, కంగారుగా అనిపించింది. "ఏం కాదు కన్నమ్మ.. ఇది చాలా చిన్న గాయం. త్వరగానే తగ్గిపోతుంది. మేమంతా ఉన్నాం. మీరు అస్సలు కంగారు పడొద్దు" అని ప్రభాస్‌ ధైర్యం చెప్పాడు. ఆ మాటలు నాకెంతో బలాన్ని ఇచ్చాయి. సర్జరీ అయ్యాక కూడా.."పెదనాన్న.. త్వరలోనే మనం జపాన్‌ వెళ్దాం. అక్కడ సినిమా ప్రమోషన్స్‌ కలిసి చేద్దాం. మన కోసం అందరూ ఎదురుచూస్తున్నారు" అంటూ ప్రతిసారీ కృష్ణంరాజుగారిలో ఒక ధైర్యాన్ని నింపుతుంటాడు. ప్రభాస్‌ మాటలకు ఆయన బాగా నవ్వుకుంటారు. వాళ్లిద్దరి మధ్య ఉన్న అనుబంధం చూస్తుంటే నాకు ఆనందంతో కన్నీళ్లు వచ్చేస్తాయి".

krishnamraju family
కృష్ణంరాజు కుటుంబం

"సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరితో మాకు మంచి అనుబంధాలున్నాయి. హీరోలందర్నీ మేము అభిమానిస్తూనే ఉంటాం. నాకు వ్యక్తిగతంగా చిరంజీవి, శోభన్‌బాబు అంటే అభిమానం. చిరంజీవి డ్యాన్స్‌ బాగా చేస్తారు. ఇక, ప్రభాస్‌ అందరితోనూ స్నేహంగా ఉంటాడు. ముఖ్యంగా చరణ్‌, ఉపాసన.. ప్రభాస్‌కి బెస్ట్ ఫ్రెండ్స్‌. చరణ్‌ కూడా పెద్దలకు గౌరవమిస్తాడు. మేము ఎక్కడ కనిపించినా.. వెంటనే వచ్చి పలకరిస్తాడు. ఉపాసన ఎంతో మంచి అమ్మాయి. కృష్ణంరాజుగారికి సర్జరీ జరిగినప్పుడు ఆమే అన్నీ దగ్గరుండి చూసుకుంది. నా కూతురిలా అనిపించింది. అంత మంచి కోడలు, కొడుకు ఉన్నందుకు చిరంజీవి గారు అదృష్టవంతులు"

prabhas
పెద్దనాన్న, పెద్దమ్మతో ప్రభాస్​

"ప్రభాస్‌ పెళ్లి గురించి అభిమానులతోపాటు మేము కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నాం. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందుకే ఆలస్యమవుతోంది. ప్రభాస్‌ ప్రేమలో ఉన్నారని వస్తోన్న వార్తలన్నీ అవాస్తవాలే. ప్రేమ పెళ్లి చేసుకున్నా మాకెలాంటి అభ్యంతరం లేదు. దేనికైనా సమయం రావాలి. త్వరలోనే శుభఘడియలు వస్తాయని అనుకుంటున్నా. 'రాధేశ్యామ్‌' చిత్రీకరణ సమయంలో ప్రభాస్‌-పూజాకు గొడవ అయిందని వార్తలు వచ్చాయి. అందులో నిజం లేదు. మా అబ్బాయి అందరితోనూ ఫ్రెండ్లీగానే ఉంటాడు. ఎవరితోనూ గొడవలు పెట్టుకోడు" అని శ్యామలా దేవి వివరించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చదవండి: 'రాధేశ్యామ్'​తో ప్రభాస్​ మరోసారి లవర్​బాయ్​గా మెప్పిస్తారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.