ETV Bharat / sitara

'రాధేశ్యామ్​' టీజర్​పై​ పూజాహెగ్డే అప్​డేట్

author img

By

Published : Feb 10, 2021, 7:20 AM IST

pooja hegde finished dubbing for Radhe Shyam teaser
'రాధేశ్యామ్​' టీజర్​పై​ పూజాహెగ్డే అప్​డేట్

'రాధేశ్యామ్' టీజర్​ గురించి మాట్లాడిన హీరోయిన్ పూజాహెగ్డే.. దాని కోసం తాను డబ్బింగ్ ముగించానని తెలిపింది. ఆ ఫొటోను ఇన్​స్టాలో పోస్ట్ చేసింది.

డార్లింగ్ ప్రభాస్ 'రాధేశ్యామ్​' టీజర్​ పనుల్లో చిత్రబృందం బిజీగా ఉంది. వాలంటైన్స్​ డే కానుకగా ఈనెల 14న ఆ వీడియోను విడుదల చేయనున్నారు. ఇప్పుడు టీజర్​ డబ్బింగ్​ను పూర్తి చేసింది హీరోయిన్ పూజాహెగ్డే.

Radhe Shyam teaser
టీజర్​ డబ్బింగ్ పూర్తి చేసిన పూజాహెగ్డే

1960ల నాటి కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా, యువీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో థియేటర్లలో చిత్రం విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

ఇది చదవండి: 2021 మాములుగా ఉండదు.. సినిమాలే సినిమాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.