ETV Bharat / sitara

పవన్​కల్యాణ్​ 'భీమ్లానాయక్​' రిలీజ్​ డేట్​ ఫిక్స్​

author img

By

Published : Feb 15, 2022, 10:04 PM IST

Pawankalyan bheemlanayak release date: పవన్​కల్యాణ్​, రానా కలిసి నటించిన మల్టీస్టారర్​ చిత్రం 'భీమ్లానాయక్​' కొత్త రిలీజ్​ డేట్​ ఖరారు చేసుకుంది. ఈ నెల ఫిబ్రవరి 25న థియేటర్లలో విడుదల కానుంది.

Pawankalyan Bheemlanak release date announced
పవన్​కల్యాణ్​ 'భీమ్లానాయక్​' రిలీజ్​ డేట్​ ఫిక్స్​

Pawankalyan bheemlanayak release date: పవర్​స్టార్ పవన్​ కల్యాణ్​ 'భీమ్లా నాయక్​' కొత్త రిలీజ్​ డేట్​ను ప్రకటించింది చిత్రబృందం. ఫిబ్రవరి 25న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అయితే అదే రోజు మెగాహీరో వరుణ్​ తేజ్​ నటించిన 'గని' కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మలయాళ హిట్ 'అయ్యప్పనుమ్ కోశియుమ్'కు రీమేక్​గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్​ పోలీస్​ అధికారిగా నటిస్తున్నారు. అతడిని ఢీ కొట్టే పాత్రలో రానా కనిపించనున్నారు. నిత్యామేనన్, సంయుక్త మేనన్​ హీరోయిన్లుగా చేస్తున్నారు. తమన్ సంగీతమందిస్తున్నారు.

Pawankalyan Bheemlanak release date announced
పవన్​కల్యాణ్​ 'భీమ్లానాయక్​' రిలీజ్​ డేట్​ ఫిక్స్​

ఇదీ చూడండి: ప్రభాస్​ సరసన 'పెళ్లిసందడి' బ్యూటీ.. వెబ్​సిరీస్​లో రామ్​చరణ్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.