ETV Bharat / sitara

Paruchuri: పరుచూరి గోపాలకృష్ణకు డి లిట్ పట్టా

author img

By

Published : Jun 12, 2021, 6:29 AM IST

తెలుగు సినిమాల గురించి సమర్పించిన సిద్ధాంత వ్యాసానికిగాను సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ.. డి లిట్ పట్టా అందుకోనున్నారు. ఈ సందర్భంగా ఇందుకోసం అమూల్యమైన సమాచారం అందించిన ఈటీవీ యాజమాన్యానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

paruchuri gopala krishna d litt doctorate received
పరుచూరి గోపాలకృష్ణ

ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణకు ఒడిశాలోని బ్రహ్మపురం విశ్వవిద్యాలయం డి లిట్‌ పట్టాను ప్రదానం చేయనుంది. 'తెలుగు సినిమా కథ-సామాజిక దృష్టి' అనే అంశంపై ఆయన సమర్పించిన సిద్ధాంత వ్యాసానికి ఈ పట్టాను అందజేస్తున్నట్లు శుక్రవారం విశ్వవిద్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.

తన పరిశోధనలో విలువైన సూచనలు అందజేసిన సింగుపురం నారాయణరావుకు, అమూల్యమైన సమాచారం అందించిన ఈటీవీ యాజమాన్యానికి, రామోజీ గ్రూప్‌ సంస్థల అధినేత రామోజీరావుకు ఈ సందర్భంగా పరుచూరి ధన్యవాదాలు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.