ETV Bharat / sitara

'అప్​డేట్ ఇవ్వండయ్యా!': ట్విట్టర్​లో తారక్​ ఫ్యాన్స్​ ట్రెండింగ్​​

author img

By

Published : Apr 6, 2021, 1:07 PM IST

Updated : Apr 6, 2021, 1:27 PM IST

#WakeUpNTR30Team hashtag trending on Twitter
ట్విట్టర్​లో తారక్​ అభిమానుల ట్రెండింగ్​​

ఎన్టీఆర్​-త్రివిక్రమ్​ కాంబోలో తెరకెక్కనున్న సినిమా అప్​డేట్​ కోసం తారక్​ అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ప్రాజెక్టు గురించి ప్రకటన వచ్చి దాదాపుగా 13 నెలలు దాటినా.. ఇప్పటికీ ఆ సినిమాపై ఎలాంటి అప్​డేట్​ రాకపోవడం వల్ల అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఈ నేపథ్యంలో సినిమా గురించి సమాచారం కావాలంటూ ఎన్టీఆర్​ ఫ్యాన్స్​ ట్విట్టర్​లో ట్రెండ్ సృష్టిస్తున్నారు.

యంగ్​టైగర్​ ఎన్టీఆర్​ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న 'ఆర్​ఆర్​ఆర్​' చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో రామ్​చరణ్​, అలియా భట్​, ఒలివియా మోరిస్​ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా తర్వాత తారక్​-త్రివిక్రమ్ కాంబోలో సినిమా రూపొందనుందని హారికా, హాసిని క్రియేషన్స్​, సితారా ఎంటర్​టైన్మెంట్స్​ సంస్థ 13 నెలల క్రితమే ప్రకటించింది.

అయితే, ఇన్ని నెలలు గడిచినా ఈ ప్రాజెక్టుపై ఎలాంటి సమాచారం లేకపోవడం వల్ల సినిమా పట్టాలెక్కుతుందా? లేదా? అనే అనుమానం వ్యక్తమవుతోంది. దీంతో ఎన్టీఆర్​ అభిమానులు ట్విట్టర్​లో ట్రెండ్​ సృష్టిస్తున్నారు. ఎన్టీఆర్​-త్రివిక్రమ్​ చిత్ర అప్​డేట్​ కావాలంటూ #వేకప్​ఎన్టీఆర్​30టీమ్​ అంటూ హ్యాష్​ట్యాగ్​ను ట్రెండ్​ చేస్తున్నారు.

అయితే త్రివిక్రమ్ చెప్పిన కథకు ఎన్టీఆర్​ కొన్ని మార్పులు అవసరమని భావించినట్లు టాలీవుడ్​ వర్గాలు అంటున్నాయి. దీంతో ఈ ప్రాజెక్టును పక్కనపెట్టి బుచ్చిబాబు సానా దర్శకత్వంలో నటించేందుకు తారక్​ సిద్ధమయ్యారని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

ఇదీ చూడండి: అడవి అందాల నడుమ మెరిసిందో తార!

Last Updated :Apr 6, 2021, 1:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.