ETV Bharat / sitara

ఎన్టీఆర్‌-త్రివిక్రమ్‌ చిత్రంలో సంజయ్‌ దత్‌!

author img

By

Published : Sep 11, 2020, 5:49 PM IST

యంగ్​టైగర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమాలో సంజయ్ దత్ కీలక పాత్ర పోషించబోతున్నాడంటూ వార్తలు వస్తున్నాయి.

NTR-Trivikram film update
ఎన్టీఆర్‌-త్రివిక్రమ్‌ చిత్రంలో సంజయ్‌ దత్‌!

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. 'అరవింద సమేత వీర రాఘవ' చిత్రం తరువాత త్రివిక్రమ్‌- తారక్‌ కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రం కావడం వల్ల అంచనాలు భారీగా పెరిగాయి. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం చిత్రసీమలో చక్కర్లు కొడుతోంది.

ఈ చిత్రంలో సంజయ్‌ దత్‌ కీలక పాత్రలో నటించేలా ఆయన పాత్రను రూపొందిస్తున్నారని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఇందులో సంజయ్ రాజకీయనాయకుడిగా కనిపించనున్నాడట.

ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కాగానే సింగిల్ షెడ్యూల్లో షూటింగ్‌ని పూర్తి చేయాలని దర్శకుడు త్రివిక్రమ్‍ చూస్తున్నాడట. కాగా సంజయ్‌దత్‌కు లంగ్‌ క్యాన్సర్‌. సంజు ముంబయిలోనే మొదటి సెషన్‌ కీమో థెరఫీ చికిత్స తీసుకుంటున్నాడు. త్వరలోనే మళ్లీ షూటింగ్​లో పాల్గొననున్నాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.